గ్రామీణ ప్రజలకు శుభవార్త తెలిపిన తెలంగాణ సర్కార్

తెలంగాణ సర్కార్ గ్రామీణ ప్రజలకు శుభవార్త తెలిపేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యాలను దృష్టి పెట్టుకుని..తెలంగాణ ప్రభుత్వం 104 ఆరోగ్య సేవలు మాదిరిగానే మొబైల్ మెడికల్ ల్యాబ్‌లను వైద్య, ఆరోగ్య శాఖ అందుబాటులోకి తీసుకురాబోతోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో అందరికీ ఉచితం హెల్ట్ చెక్‌అప్‌తో పాటు పరీక్షలు కూడా ఉచితంగా చేయనున్నారు. ఇందు కోసం అత్యాధునికి టెక్నాలజీతో వాహానాల్లో మెడికల్ ల్యాబ్‌లను సిద్ధం చేయనున్నాను. అదేవిధంగా ఇందులో 26 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న వారికి అన్ని రకాల రక్త పరీక్షలు, క్యాన్సర్, షుగర్‌, గుండె జబ్బులకు సంబంధించి స్క్రీనింగ్‌ పరీక్షలను నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నట్లు తెలిస్తే వారికి ఉచితంగా మందులు కూడా అందింజేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.