3 జోన్లుగా ‘హైడ్రా’.. HMDA వరకు విస్తరణ

హైడ్రాను HMDA వరకు విస్తరించి, 3 జోన్లుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ను సెంట్రల్‌ జోన్‌గా సైబరాబాద్‌ను నార్త్‌ జోన్‌గా, రాచకొండను సౌత్‌జోన్‌గా విభజించనుంది. వాటికి జోనల్‌ అధికారులు, పూర్తిస్థాయి సిబ్బందిని నియమించేందుకు కసరత్తు మొదలైంది. ఆ మూడు జోన్లను చీఫ్‌ కమిషనర్‌ పర్యవేక్షిస్తారని ప్రభుత్వం తెలిపింది. రెండు నెలల క్రితం ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటైన హైడ్రాకి చట్టబద్ధత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది. ఆ విషయంపై ఆర్డినెన్స్‌ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ను సెంట్రల్ జోన్ గా, రాచకొండ-సౌత్, సైబరాబాద్ ను నార్త్ జోన్ గా విభజించనుంది. హైడ్రాకు చట్టబద్ధతపై న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది. దీనిపై ఆర్డినెన్స్ జారీ చేయాలని, ప్రత్యేక పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల జరిగిన బడ్జెట్‌ సమావేశాల తర్వాత శాసనసభను ప్రొరోగ్‌ చేసినందున ఆర్డినెన్స్‌ జారీకి ప్రభుత్వానికి వెసులుబాటు లభించిందని హైడ్రా చీఫ్‌ రంగనాథ్‌ వివరించారు. ఈ మేరకు వారం, పది రోజుల్లో ముసాయిదాను సిద్ధం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.