దసరా సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana government announced Dussehra holidays

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 12న దసరా పండుగ ఉంది. 15వ తేదీ నుంచి యథావిధిగా పాఠశాలలు తెరుచుకుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

దసరా పర్వదినానికి ముందు తెలంగాణలో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ ఉంటుంది. అక్టోబర్ 2న ఎంగిలిపూల బతుకమ్మ పండుగతో ప్రారంభమై, దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి. దసరాకు రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మ పండుగ ఉంటుంది.

డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఐదు రోజుల పాటు క్రిస్మస్ హాలీడేస్‌ను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇక సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. సంక్రాంతి సెలవులు ఐదు రోజులు ఇచ్చారు.