తెలంగాణ డీఎస్పీ హాల్‌ టికెట్లు విడుదల..

ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు జరగనున్న డీఎస్సీ పరీక్షల హాల్టికెట్లను విద్యా శాఖ విడుదల గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 11,062 పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విధితమే. ఈ మేరకు విద్యాశాఖ మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. తాజాగా వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లను విడుదల చేసింది.

ఈ నెల 18 నుంచి సీబీటీ బేస్డ్‌ టెస్ట్ నిర్వహించనుంది. సీబీఆర్‌టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో డీఎస్పీ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్ష కోసం 2,79,966 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తు వచ్చాయి. 11,062 ఉద్యోగాల్లో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ చూస్తే

జులై 18న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్‌ పరీక్ష జరుగుతుంది.
జులై 18న సెకండ్ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ టెస్ట్‌ ఉంటుంది.
జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షను ప్రభుత్వం నిర్వహించనున్నది.
జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగుతాయి.
జులై 22 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష జరుగుతుంది.
23న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు.
24న స్కూల్ అసిస్టెంట్- బయలాజికల్ సైన్స్‌ పరీక్ష జరుగుతుంది.
26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష ఉంటుంది.
30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష జరుగుతుంది.