కార్వాన్ లో పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత

Kavitha: తెలంగాణ అప్పు రూ.4,37,000 కోట్లు మాత్రమే : కవిత

Kavitha : నేడు 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆర్ధిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తెలంగాణ రాష్ట్రం అప్పు 2014 నుండి ఈరోజు వరకు రూ.4,37,000 కోట్లు అని బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఈ తరుణంలోనే కేసీఆర్ గారు చేసిన అప్పుల గురించి గతంలో రేవంత్ రెడ్డి చేసినవన్ని అసత్య ప్రచారాలని ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా తేలిపోయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు.

Advertisements
తెలంగాణ అప్పు రూ.4,37,000 కోట్లు మాత్రమే

బడ్జెట్ లో ప్రవచనాలు ఎక్కువ పైసలు తక్కువ

బడ్జెట్ లో ప్రవచనాలు ఎక్కువ పైసలు తక్కువ అంటూ చురకలు అంటించారు. చెప్పిన మాటలే చెప్పడం తప్ప ఏలాంటి నిజాలు లేవని ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వం కట్టిన అప్పు 30 వేల కోట్లు మాత్రమే కానీ లక్ష 40,000 కోట్లు అప్పు కట్టినమని సీఎం చెబుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి 4,37,000 కోట్ల అప్పు అన్నారు. కానీ ఏడు లక్షల కోట్ల అప్పు అని కేసీఆర్‌ ప్రభుత్వం పై నిందలు వేశారన్నారు. బడ్జెట్ బుక్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినవన్నీ అబద్ధాలని తేలిందని వెల్లడించారు.

గతేడాది వర్షాలు సమృద్ధిగా పండాయి

కాంగ్రెస్‌ పాలనలో ఆయకట్టు కింద ఉన్న పొలాలు కూడా ఎండిపోతున్నాయన్నారు. మార్చిలోనే ఇలా ఉంటే ఏప్రిల్‌, మే నెలల్లో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు కృష్ణా నది నుంచి 10 వేల క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నారని విమర్శించారు. ఎండల వల్లే రాష్ట్రంలో పంటలు ఎండుతున్నాయని కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటని కవిత విమర్శించారు. గతేడాది వర్షాలు సమృద్ధిగా పండాయని, ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వాటర్‌ మేనేజ్‌మెంట్‌ తెలియకపోవడంతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Posts
ఏపీలో మరో క్యాన్సర్ హాస్పిటల్: బాల‌కృష్ణ
ఏపీలో మరో క్యాన్సర్ హాస్పిటల్: బాల‌కృష్ణ

తెలుగుభాషలో ప్రముఖ నాయకుడు, నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని మరింత విస్తరించబోతున్నట్లు ప్రకటించారు. దీనితో పాటు, ఆసుపత్రి యొక్క పలు కీలక Read more

స్పేస్‌ఎక్స్ ఆరవ స్టార్షిప్ పరీక్షా ప్రయోగం
space x

స్పేస్‌ఎక్స్ తన స్టార్‌షిప్ లాంచ్ వాహనానికి సంబంధించిన ఆరవ పరీక్షా ప్రయోగం ఈ రోజు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇది అక్టోబర్ 13, 2024 న జరిగిన 5వ Read more

నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ap assembly sessions

నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభం అవుతున్నాయి. చాలా కాలం తరువాత, ఈ సమావేశాలు రసవత్తరంగా సాగే అవకాశం Read more

నటి జయప్రద ఇంట విషాదం
jayaraja

సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె సోదరుడు రాజబాబు కన్నుమూశారు. ఈ విషయాన్ని జయప్రద స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×