7వేల ఇళ్లు నేలమట్టం.. బాధితులకు ఇందిరమ్మ గృహాలు

తెలంగాణ లో భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 7వేల ఇళ్లు కూలిపోయాయని ప్రభుత్వానికి కలెక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. కొన్ని పూర్తిగా, కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో బాధితులకు ఇందిరమ్మ గృహాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూలిన ఇళ్లలో ఎక్కువగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోనే ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కింద స్థలం ఉంటే రూ. 5లక్షలు, లేని వారికి స్థలం+ రూ. 5లక్షలు ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది.