నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు సా. 4 గంటలకు క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖలకు ఉన్న ప్రత్యేక అధికారాలను హైడ్రాకు కల్పించడంపై నిర్ణయం తీసుకోనుంది. కొత్త రేషన్, ఆరోగ్య శ్రీ కార్డుల జారీ, వరద నష్టం, పరిహారం చెల్లింపుపై చర్చించనుంది. తెలుగు వర్సిటీకి సురవరం, కోఠి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ, హ్యాండ్లూమ్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను పెట్టడానికి ఆమోదం తెలపనుంది.

తెలంగాణలో కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా (రైతు బంధు) కింద రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.15,000 పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు గడుస్తున్నా ఇప్పటికి వరకు రైతు భరోసాపై ఎలాంటి ప్రకటన చేయలేదు.. నిధులు విడుదల చేయలేదు. అధికారంలో వచ్చిన మొదటి సారి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు కిందనే ఎకరాకు రూ.10,000లను కాంగ్రెస్ సర్కార్ అందించింది. అయితే ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో రేషన్ కార్డులు జారీ, హెల్త్ కార్డులు మంజూరు?, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు, త్రిబుల్ ఆర్ భూసేకరణ, పనుల ప్రారంభం, ఎస్ఎల్బిసి పనులు – నిధుల విడుదల, ఉద్యోగుల డీఏలు – సమస్యలు తదితర అంశాలపై చర్చించున్నట్లు సమాచారం.