తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించేందుకు మంత్రివర్గ సమావేశం రేపు (ఉదయం 9.30 గంటలకు) అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించబడుతుంది. బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రివర్గ సభ్యులు చర్చించి, ఆమోదం తెలుపనున్నారు.
శాసనసభ, మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రులు
ఉదయం 11.14 గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో, మంత్రి శ్రీధర్ బాబు శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌లో రైతులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు కల్పించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

అభివృద్ధి ప్రాజెక్టులకు పెద్దపీట
ఈసారి బడ్జెట్‌లో ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అధికంగా నిధులు కేటాయించే అవకాశముంది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, పల్లె ప్రగతి – పట్టణ ప్రగతి పథకాలు, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రజా సంక్షేమం ప్రధాన లక్ష్యం
తెలంగాణలో కొత్త ప్రభుత్వ ఏర్పాటైన తర్వాత రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇదే మొదటి బడ్జెట్. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, నూతన పథకాలను ప్రవేశపెట్టే అవకాశముందని అంటున్నారు. విభిన్న రంగాలకు నిధుల కేటాయింపులు, కొత్త ప్రాజెక్టుల అమలుపై రేపటి బడ్జెట్‌లో కీలక స్పష్టత రానుంది.