రెండో రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana assembly meetings started on the second day

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. జాబ్ క్యాలెండర్‌పై ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఈ మేరకు సభలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ సభలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, నిరుద్యోగుల సమస్యలపై ఉభయ సభల్లో బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం కోరుతూ నోటీసులు ఇచ్చింది. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటనతోపాటు ఇతర న్యాయ పరమైన డిమాండ్ల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరి, నిరుద్యోగుల ఆందోళనలపై ప్రభుత్వ అణచివేత వైఖరిపై చర్చ చేపట్టాలని కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ మేరకు శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ నోటీసులిచ్చారు.