tigala krishnareddy

చంద్రబాబు ను కలిసిన బిఆర్ఎస్ నేతలు

మాజీ మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డిలు ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్బంగా తీగల..తాను టిడిపిలో చేరబోతున్నట్లు తెలిపాడు. సోమవారం జూబ్లీహిల్స్ లోని చంద్ర‌బాబు నివాసంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. అలాగే ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి, ఆయ‌న అల్లుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు సైతం ఉన్నారు.

ఈ సందర్బంగా తీగల తాను టీడీపీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఆయ‌న బీఆర్ఎస్ పార్టీలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్‌తో త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లైంద‌ని గుర్తు చేసిన ఆయ‌న‌… హైద‌రాబాద్ అభివృద్ధి చేసింది వంద‌కు వంద‌శాతం చంద్ర‌బాబేన‌ని అన్నారు. తెలంగాణ‌లో టీడీపీ పాల‌న మ‌ళ్లీ రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు.

ఇక చంద్ర‌బాబును క‌లిసిన మ‌ల్లారెడ్డి త‌న‌ మ‌న‌వ‌రాలు శ్రేయ‌రెడ్డి పెళ్లికి సీఎంను ఆహ్వానించారు. గ‌తంలో మ‌ల్లారెడ్డి, మాధ‌వ‌రం కృష్ణారావు, తీగ‌ల కృష్ణారెడ్డి టీడీపీలో ప‌నిచేసిన విష‌యం తెలిసిందే. కానీ, ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో టీడీపీని వీడారు. మ‌ల్లారెడ్డి మ‌న‌వ‌రాలు పెళ్లి కార‌ణంగా చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు టీడీపీ అధినేత‌ను క‌లిశారు.

Related Posts
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసులు మృతి
Road accident in America. Five Indians died

రోడ్డు ప్రమాదాలు అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సమస్యగా మారింది. ఇవి ప్రమాదకరమైన పరిస్థితులు, మరణాలు, గాయాలు, ఆర్థిక నష్టం మరియు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. Read more

ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్న ప్రధాని మోడీ
PM Modi will visit Gujarat today and tomorrow

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాక.. విశాఖ నగరంలో ప్రధాని Read more

హరియాణా ఫలితాలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
Congress complains to EC on

హరియాణా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు పెద్ద Read more

ట్రంప్ తో నేరుగా పని చేయాలని అనుకుంటున్నాను – జెలెన్‌స్కీ
zelensky

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ, ఫిబ్రవరి 2022 లో ప్రారంభమైన యుద్ధంలో రష్యా దాడులు తీవ్రతరంగా మారటంతో, అమెరికా అధ్యక్షుడు ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తో నేరుగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *