లీడ్ గ్రూప్ యొక్క టెక్ బుక్ (TECHBOOK)

2028 నాటికి, భారతదేశంలోని టాప్ 5000 పాఠశాలలు టెక్ బుక్స్ కి అప్‌గ్రేడ్ అవుతాయని కంపెనీ ఆశిస్తోంది.

TECHBOOK OF LEAD GROUP

హైదరాబాద్‌: భారతదేశంలోని అతిపెద్ద స్కూల్ ఎడ్‌టెక్ కంపెనీ, లీడ్ గ్రూప్, సాంప్రదాయ పాఠ్యపుస్తకం-ఆధారిత అభ్యాసాన్ని మార్చడానికి రూపొందించిన తెలివైన పుస్తకమైన టెక్ బుక్ ని ఈరోజు విడుదల చేసినట్లు ప్రకటించింది. నేడు పాఠశాల విద్యార్థులలో కీలక అభ్యాస సవాళ్లను పరిష్కరించడానికి టెక్ బుక్ మూడు అత్యాధునిక సాంకేతికతలను మరియు ఎన్ సి ఎఫ్ సమలేఖన పాఠ్యాంశాలను తీసుకువస్తుంది. లీడ్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ సుమీత్ మెహతా మాట్లాడుతూ, “శతాబ్దాలుగా, తరగతి గదులలో విద్య యొక్క ప్రాథమిక సాధనం, పాఠ్య పుస్తకం మారలేదు. అయితే ఏఐ మరియు ఎఆర్ /విఆర్ పరిశ్రమలలో వ్యక్తిగతీకరించిన, మల్టి -మోడల్ మరియు గేమిఫైడ్ అనుభవాలకు ప్రపంచాన్ని తరలించాయి. మన దేశం యొక్క భవిష్యత్తు కోసం మనం భవిష్యత్తు నుండి అవసరమైనది తెచ్చుకున్నాము. టెక్ బుక్ అనేది సాంకేతికత, బోధనా శాస్త్రం మరియు పాఠ్యాంశాల్లోని అనేక సంవత్సరాల పరిశోధనల యొక్క విప్లవాత్మక పరిణామం. ఇది విద్యార్థులు అభ్యసించే విధానం మారుస్తుంది. 2028 నాటికి, భారతదేశంలోని 5000 అగ్రశ్రేణి పాఠశాలలు టెక్ బుక్స్ కి అప్‌గ్రేడ్ అవుతాయని మేము ఆశిస్తున్నాము, తద్వారా దేశవ్యాప్తంగా తరగతి గదులలో వ్యక్తిగతీకరించిన మరియు ఇంటరాక్టివ్ లెర్నింగ్‌ను సాధారణంగా మారుస్తుంది” అని అన్నారు.

వ్యక్తిగతీకరించిన మరియు ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనుభవాన్ని పరిచయం చేయడం ద్వారా టెక్ బుక్ సాంప్రదాయ పాఠ్యపుస్తకాల పరిమితులను పరిష్కరిస్తుంది. విభిన్న అభ్యాస స్థాయిలతో తరగతి గదులలో, టెక్ బుక్ ప్రతి విద్యార్థికి వ్యక్తిగతీకరించిన సూచనలను అనుమతిస్తుంది. ఇది మూడు శక్తివంతమైన లక్షణాలను అనుసంధానిస్తుంది: ఆగ్మెంటెడ్ రియాలిటీ: సాంప్రదాయ 2డి పాఠ్యపుస్తకాలు సహజంగా 3డి స్వభావం కలిగిన సంక్లిష్ట భావనలను గ్రహించటంలో విద్యార్థుల సామర్థ్యాన్ని పరిమితం చేస్తాయి. సైన్స్ మరియు గణితం వంటి సబ్జెక్టులను ఏఆర్ఐ (ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇన్‌స్ట్రక్టర్)తో టెక్ బుక్ జీవం పోస్తుంది, విద్యార్థులు 3డి లో టాపిక్‌లతో ఇంటరాక్ట్ అయ్యేలా చేస్తుంది. వ్యక్తిగతీకరించిన పఠన పటిమ: భాషా అభ్యాసం కోసం, టెక్ బుక్ యొక్క ఐఆర్ఏ (ఇండిపెండెంట్ రీడింగ్ అసిస్టెంట్) వ్యక్తిగత ట్యూటర్‌గా పనిచేస్తుంది, విద్యార్థులకు పుస్తకాలను బిగ్గరగా చదవడంతోపాటు, విద్యార్థి చదవడాన్ని వింటూ మరియు వారి పఠన పటిమ మరియు ఉచ్చారణపై నిజ-సమయ అభిప్రాయాన్ని అందిస్తుంది.

వ్యక్తిగతీకరించిన అభ్యాసం: పిఐఈ (వ్యక్తిగతీకరించిన ఇంటరాక్టివ్ ఎక్సర్సైజులు), విద్యార్థులు స్వీకరించతగిన రీతిలో అనుకూలమైన అపరిమిత వ్యాయామాలను పొందుతారు. కాబట్టి విద్యార్థులు తమ స్వంత వేగంతో సబ్జెక్టులను నేర్చుకోవచ్చు, దీనితో అభ్యాసం సరదాగా మరియు నిరంతర ప్రక్రియ గా ఉంటుంది. సుమీత్ ఇంకా మాట్లాడుతూ , “మొదటి సంవత్సరంలో, దేశంలోని టాప్ 400 ఇన్నోవేటర్ స్కూళ్లకు టెక్ బుక్ లు ‘ఇన్వైట్ ఓన్లీ ’ గా ఉంటాయి. విద్యార్ధి-కేంద్రంగా మరియు ఉపాధ్యాయులకు సహాయపడే విధంగా పాఠశాలల్లో ఏఐ మరియు సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావటం లో భారతదేశం ముందుందనిచూపటం తో పాటుగా ప్రపంచానికి కొత్త అభ్యాస ప్రమాణాన్ని సెట్ చేయాలనుకుంటున్నాము” అని అన్నారు. లీడ్ గ్రూప్ సహ-వ్యవస్థాపకురాలు మరియు కో -సీఈఓ స్మితా డియోరా మాట్లాడుతూ , “టెక్నాలజీ శక్తి మరియు లోతుగా పరిశోధించబడిన విద్యా విషయాలతో పాఠ్యపుస్తకం యొక్క స్పర్శ అనుభవాన్ని కలపడం ద్వారా, ప్రతి విద్యార్థికి నిజంగా అధిక-నాణ్యత, వ్యక్తిగతీకరించిన అభ్యాసానికి అవకాశాలు ఉన్నాయని మేము నిర్ధారిస్తున్నాము. టెక్ బుక్ తో విద్య అనేది కేవలం కంఠస్థం చేయడమే కాకుండా అన్వేషణ, సృజనాత్మకత మరియు నైపుణ్యానికి సంబంధించినదంటూ వారి విద్యాప్రయాణాన్ని మెరుగుపరుస్తూనే , తగిన వాతావరణాన్ని మేము సృష్టిస్తున్నాము” అని అన్నారు.

శ్రీ మెహతా మాట్లాడుతూ , “మన దేశం యొక్క పురోగతికి విద్య పునాది, మరియు పాఠశాలలు ఈ పరివర్తనకు కేంద్రంగా ఉన్నాయి. టెక్ బుక్ తో, మేము తరగతి గదులలో వ్యక్తిగతీకరించిన అభ్యాసాన్ని పునర్నిర్వచించే కొత్త విభాగ అభ్యాస పరిష్కారాలను, మరియు పాఠశాల విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో నిమగ్నమయ్యే పరిష్కారాలను పరిచయం చేస్తున్నాము; ఇది అభ్యాస భవిష్యత్తు” అని అన్నారు.
గత సంవత్సర కాలంలో, లీడ్ గ్రూప్ భారతదేశంలోని పాఠశాలల మొత్తం స్పెక్ట్రమ్‌కు, అధిక ఫీజులు ఉన్న పాఠశాలల నుండి సరసమైన ఫీజులు ఉన్న పాఠశాలల వరకు తన సామర్థ్యాలను విస్తరించింది. ఉన్నత-నాణ్యత గల విద్యను అందించడంలో మరియు అకడమిక్ ఎక్సలెన్స్‌ను సాధించడంలో దేశవ్యాప్తంగా పాఠశాలలకు మద్దతు ఇవ్వడానికి గ్రూప్ తన ఆఫరింగ్స్ ను విస్తరించటం పై దృష్టి సారించింది. గ్రూప్ 2028 నాటికి దేశవ్యాప్తంగా 60,000 కంటే ఎక్కువ పాఠశాలలకు అధిక-నాణ్యత, స్కూల్ ఎడ్‌టెక్ పరిష్కారాలను అందించాలనే దాని లక్ష్యం ని వేగంగా చేరుకోవాలని చూస్తోంది.