పావ్లోహ్రద్ (ఉక్రెయిన్): ఒకప్పుడు అక్కడ సంగీత కచేరీలు శ్రోతలను ఉర్రుతలూగించేవి.ఇప్పడు అక్కడ వినిపించేవి రష్యా బాంబు దాడుల్లో గాయపడిన బాధితుల ఆర్తనాదాలు.ఉక్రెయిన్ లోని పావ్లోహ్రద్ పట్టణంలో యుద్ధ బాధితుల శిబిరంగా మారిన కాన్సర్ట్ హాలు పరిస్థితి అది. ఇలాంటి శిబిరం నిర్వహించాలంటే ఒక్కో శిబిరానికి నెలకు 7 వేలఅమెరికన్ డాలర్ల వరకు అవసరం. ఇందులో 60 శాతం అమెరికాభరిస్తోంది. విదేశాలకు అందించే మానవతా సాయాన్ని 90 రోజులపాటు స్థంబింపజేయాలని డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో విదేశాల్లో అమెరికా నిధులతో నడుస్తున్న అనేక మానవతా,అభివృద్ధి,భద్రతా కార్యక్రమాలు నిలిచిపోయాయి.

“ఇక్కడ పరిస్థితి బాగానే ఉంది.ఆహరం,వేడిమి అందుబాటులో ఉన్నాయి.స్నానాల ఏర్పాటు ఉంది”.అంటూ పావ్లోహ్రద్ కాన్సర్ట్ హాలులో తలదాచుకుంటున్న క్యాథెరిన ఒద్రహచెప్పిన మాటలు శిబిరంలో బాధితులకు అందుతున్న సౌకార్యాలనుఁ తెలియచేస్తున్నాయి. ట్రంప్ నిర్ణయంతో ఉక్రెయిన్ లో ఇలాంటి శిబిరాల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది చెప్పలేని అనిచ్చితి నెలకొంది.ఉక్రెయిన్ లో అనేక ఇతర రంగాల కార్యకలాపాలు నిలిచిపోయాయి.విద్యుత్ ప్రాజెక్ట్ లు, వయోవృద్దులకు అందించే సాయం,మానసిక పునరావాస కేంద్రాలు,ఆరోగ్య సేవలు,మీడియా,సరిహద్దులో మౌలికసదుపాయాల ప్రోజెక్ట్ లు స్తంభించిపోయాయి.