ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను పాకిస్థాన్ హోస్ట్‌గా నిర్వహించనున్నప్పటికీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమిండియాను పాకిస్థాన్ పంపించేందుకు అంగీకరించలేదు. దీనివల్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్రణాళిక ప్రకారం, టోర్నీలో టీమిండియా తన మ్యాచ్‌లన్నీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడనుంది. టీమిండియా ఫైనల్‌కు చేరితే ఆ మ్యాచ్ కూడా దుబాయ్‌లోనే జరుగుతుంది. భారత జట్టు ఫైనల్ చేరకుంటే, ఆ మ్యాచ్ పాకిస్థాన్‌లోనే జరుగుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో గత రికార్డులు ఎలా ఉన్నాయి.ఇక దుబాయ్‌లో అందరికంటే అత్యధిక వ్యక్తిగత స్కోర్ ప్లేయర్‌గా మన టీమిండియా గబ్బర్ శిఖర్ ధావన్ నిలిచాడు.2018 ఆసియా కప్‌లో హాంకాంగ్‌పై 127 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. పసికూన జట్టుపై తన పంజా విసిరాడు. గబ్బర్ దెబ్బకు హాంకాంగ్ విలవిల్లాడిపోయింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోరు సాధించిన ఓపెనర్‌గా శిఖర్ ధావన్ పేరు చరిత్రలో నిలిచిపోయింది.

బ్యాటింగ్ రికార్డులు
దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ అహ్మద్ షజాద్ 2013లో శ్రీలంకతో మ్యాచ్‌లో 124 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయినా ఆ మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది. ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు మహ్మద్ షెహజాద్ 2018లో టీమిండియాపై 124 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అదే టోర్నీలో బంగ్లాదేశ్ బ్యాటర్ లిట్టన్ దాస్ 121 పరుగులు చేశాడు. కానీ ఫైనల్లో భారత్ విజయం సాధించింది.
తొలి సెంచరీ & ఇతర విశేషాలు
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 2010లో తొలి వన్డే మ్యాచ్ తర్వాతి. అయితే తొలి వన్డే జరిగిన ఏడాది తర్వాత సౌతాఫ్రికా హషీమ్ ఆమ్లా ఈ గ్రౌండ్‌లో సెంచరీ చేశాడు. ఈ స్టేడియంలో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో పాక్‌పై దక్షిణాఫ్రికా 2 పరుగుల తేడాతో గెలిచింది.
దుబాయ్ మైదానం ప్రత్యేకత
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం స్పిన్నర్లకు అనుకూలం. అయితే, ఇటీవల వేగంగా ఆడే ఆటగాళ్లు కూడా ఇక్కడ మెరుగైన ప్రదర్శన చూపిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా దుబాయ్ మైదానంలో ఆడటం మానసికంగా బలాన్నిస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.టీమిండియా దుబాయ్ స్టేడియంలో సానుకూల ఫలితాలు సాధించిందన్న విశ్వాసం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత బ్యాటింగ్, బౌలింగ్ యూనిట్ ఎలా రాణిస్తుందో చూడాలి.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ ప్లేయర్ సౌరవ్ గంగూలీ అగ్ర స్థానంలో ఉన్నాడు. ఈ మినీ వరల్డ్ కప్ లో దాదా మొత్తం 13 మ్యాచ్‌లలో 11 ఇన్నింగ్స్‌లలో 73 సగటుతో 665 పరుగులు చేశాడు. మొత్తం 17 సిక్సర్లు బాదాడు. వెస్టిండీస్ మాజీ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ లాంగ్ సిక్సర్లు కొట్టడంలో బాగా నేర్పరి. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రెండవ ప్లేయర్ గా ఈ కరేబియన్ దిగ్గజం నిలిచాడు . అతను 17 మ్యాచ్‌ల్లో 791 పరుగులు చేయగా, 15 సిక్సర్లు కొట్టాడు. ఇంగ్లాండ్‌కు చెందిన ఇయాన్ మోర్గాన్ (14 సిక్సర్లు) మూడో స్థానంలో, ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వాట్సన్ (12 సిక్సర్లు) నాలుగో స్థానంలో, ఇంగ్లాండ్‌కు చెందిన పాల్ కాలింగ్‌వుడ్ 11 సిక్సర్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.