ycp kamalapuram

కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ షాక్

వైసీపీ అధినేత జగన్ కు వరుస షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నేతలంతా రాజీనామా చేస్తూ టీడీపీ , జనసేన లలో చేరుతున్నారు. ఇప్పటికే కీలక నేతలు జాయిన్ కాగా…ఇప్పుడు కిందిస్థాయి నేతలు చేరుతున్నారు. తాజాగా కమలాపురం పురపాలక సంఘంలోని వైసీపీ నేతలు…టీడీపీ లో చేరారు.పురపాలక ఛైర్మన్‌ మర్పూరి మేరీ, కౌన్సిలర్లు షేక్‌నూరి, రాజేశ్వరి, సలీల, నాగమణి సోమవారం టీడీపీలో చేరారు.

ఇదివరకే కొందరు కౌన్సిలర్లు చేరగా తాజాగా చేరిన వారితో కలుపుకొని టీడీపీ సంఖ్యా బలం 10కి పెరిగింది. ఫలితంగా వైసీపీ సంఖ్యా బలం 8కి తగ్గింది. దీంతో కమలాపురం పురపాలక పీఠం దాదాపు అధికార పార్టీ వశమైనట్టే. త్వరలో జరిగే పురపాలక సర్వసభ్య సమావేశంలో ఛైర్మన్‌ను ఎన్నుకునే అవకాశాలున్నాయి. ఈ మేరకు టీడీపీ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామంతో కమలాపురం వైసీపీ శాసనసభ్యుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్‌ రెడ్డికి భారీ షాక్ తగిలినట్టు అయ్యింది.

Related Posts
వికసిత్ భారత్: మోదీతో యువత సంభాషణ
వికసిత్ భారత్ మోదీతో యువత సంభాషణ

కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా నేతృత్వంలో భారత మండపంలో 'వికసిత్ భారత్ యువ లీడర్స్ డైలాగ్' కార్యక్రమం నిర్వహించబడుతోంది. మూడు Read more

సోషల్ మీడియాకు దూరంగా ఉండండి – డైరెక్టర్ పూరీ
director puri

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తాజాగా తన పాడ్కాస్ట్‌లో సోషల్ మీడియా ప్రభావంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా నెగటివిటీకి కేంద్రంగా మారిందని, ఇది Read more

క్షీణించిన ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం
క్షీణించిన ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బిపిఎస్సి) అభ్యర్థులకు మద్దతు ఇవ్వడానికి జనవరి 2 న ప్రారంభించిన నిరాహార దీక్షలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం క్షీణించడంతో Read more

ఆనాడు విజన్ 2020 అంటే ఎగతాళి చేశారు : లోకేష్
Then Vision 2020 was mocked.. Lokesh

జ్యూరిచ్: ఏపీకి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం జ్యూరిచ్ లో అక్కడి తెలుగు పారిశ్రామిక వేత్తలతో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *