tdp high respond on nara lokesh deputy cm demands

లోకేశ్‌కు డిప్యూటీ సీఎం హోదా..అధిష్టానం కీలక ఆదేశాలు

అమరావతి: ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ ఆ పార్టీ సీనియర్ నేతల నుంచి బలంగా వినిపిస్తోన్న వేళ సోమవారం టీడీపీ అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక పై ఈ అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దని ఆ పార్టీ నేతలను ఆదేశించింది. మీడియా వద్ద కానీ, బహిరంగంగా కానీ ఈ వ్యవహారంపై స్పందించొద్దని.. ఎలాంటి ప్రకటనలు చెయ్యొద్దని స్పష్టం చేసింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని.. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దొద్దని పేర్కొంది.

image

నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ల నేపథ్యంలో జనసేన వర్గీయుల నుంచి కౌంటర్ అటాక్ మొదలయింది. “లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయండి… అందులో తప్పేమీ లేదు… పవన్ కల్యాణ్ ను సీఎం చేయండి” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం సీరియస్ అయింది. అత్యుత్సాహం వద్దంటూ టీడీపీ నేతలకు సూచించింది.

కాగా, ఇటీవలే సీఎం చంద్రబాబు మైదుకూరు పర్యటనలో ఉన్నప్పుడు కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవీ ఇవ్వాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీతో సంబంధం లేకపోయినప్పటికీ ఎవ్వరి వ్యక్తిగత అభిప్రాయాలను వారు చెబుతున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు. తాజాగా హోంమంత్రి అనిత సైతం లోకేష్ హోంమంత్రి పై స్పందించారు. ఈ నేపథ్యంలో ఈ అంశం పై ఎవ్వరూ మాట్లాడవద్దని పార్టీ నేతలకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

Related Posts
రైతులకు శుభవార్త తెలిపిన RBI
RBI gives good news to farm

రైతులకు కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుభవార్త అందించింది. చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే వ్యవసాయ రుణాల పరిమితిని 1.6 లక్షల Read more

చిరంజీవిని కలిసిన నాగార్జున
Nagarjuna meet Chiranjeevi

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవిని హీరో నాగార్జున కలిశారు. త్వరలో జరిగే ఏఎన్‌ఆర్‌ అవార్డుల వేడుకకు ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ మేరకు నాగార్జున ఈ ఫొటోలను తన Read more

హైదరాబాద్ లో పెరుగుతున్న స్కార్లెట్ ఫీవర్
హైదరాబాద్ లో పెరుగుతున్న స్కార్లెట్ ఫీవర్

స్కార్లెట్ జ్వరం అనేది గ్రూప్ ఎ స్ట్రెప్టోకోకస్ వల్ల పిల్లలలో కలిగే కాలానుగుణ బ్యాక్టీరియా సంక్రమణ, మరియు దీనికి నిర్దిష్ట యాంటీబయాటిక్స్తో చికిత్స చేయవచ్చు. పిల్లలు బ్యాక్టీరియాకు Read more

వైసీపీ ఏ కూటమిలో చేరదు: విజయసాయిరెడ్డి
Vijayasai reddy

కేంద్రంలో ఏ కూటమిలో చేరే ఆలోచన తమకు లేదని వైసీపీ నేత విజయ సాయిరెడ్డి తేల్చిచెప్పేశారు. తమది న్యూట్రల్ స్టాండ్ అన్నారు. ఏపీలో గత ఐదేళ్లుగా అధికార Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *