TDP candidates who have fil

రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభలో ఖాళీ అయిన మూడు ఎంపి స్థానాల భర్తీకి సంబంధించి టిడిపి అభ్యర్థులుగా బీద మస్తాన్ రావు, సానా సతీష్ బాబు, బిజెపి తరుపువ ఆర్. కృష్ణయ్యలు నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం అసెంబ్లీ భవనంలో రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్. వనితా రాణి వద్ద రాజ్యసభ ఎంపి అభ్యర్ధులుగా వారు నామినేషన్లను దాఖలు చేశారు.

మూడు రాజ్యసభ స్థానాలకు ముగ్గురు అభ్యర్ధులే నామినేషన్ల దాఖలు చేయడంతో నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణల గడువు అనంతరం వారి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈనామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు తరపున ఆయా పార్టీల ప్రతినిధులుగా రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, కె.అచ్చన్నాయుడు. పి. నారాయణ, పలువురు ఎంఎల్ఎలు తదితరులు పాల్గొన్నారు.

ఇక నామినేషన్లు దాఖలు అనంతరం బీదా మస్తాన్ రావు, సానా సతీశ్, ఆర్. కృష్ణయ్య మీడియాతో • మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ అన్ని రంగాల్లో ముందుకెళ్లేందుకు ప్రయత్నం జరుగుతుందని, వారికితోడు మేముకూడా తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు. రాజ్యసభ సభ్యులుగా తమకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ తరుపున రాజ్యసభ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ఆర్. కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏ పార్టీలో ఉన్నా నేను బీసీల సంక్షేమంకోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. నేను ఏ పార్టీలోకి వెళ్లలేదు.. నన్ను పిలిచి సీటిచ్చారని పేర్కొన్నారు. నేను ఏ పార్టీలో ఉన్నా బీసీల కోసమే పోరాడతా.. అవకాశం ఉన్నప్పుడు పార్టీకోసం పనిచేస్తానని చెప్పారు. బీజేపీయే తనను ఆహ్వానించి రాజ్యసభ సీటు ఇచ్చిందని ఆర్. కృష్ణయ్య తెలిపారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీ పీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఆర్. కృష్ణయ్య అభినందనలు తెలిపారు.

Related Posts
భవిష్యత్తులో 3.5 రోజుల పని వారాలు: AI ద్వారా పని సమయం తగ్గుతుందా?
ai

జేపీమోర్గాన్ సీఈఓ జేమీ డైమన్, భవిష్యత్ తరగతుల కోసం వారానికి 3.5 రోజుల పని వారాలను అంచనా వేస్తున్నారు. ఆయన అనుసరించిన అభిప్రాయం ప్రకారం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ Read more

ఎల్కే అద్వానీకి తీవ్ర అస్వస్థత
BJP stalwart LK Advani's he

బీజేపీ సీనియర్ నేత మరియు భారత రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి ఎల్కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 97 సంవత్సరాల వయసులో ఉన్న ఆయన, ఢిల్లీలోని అపోలో Read more

తెలంగాణ గ్రామీణ మహోత్సవ్‌
Toyota Kirloskar Motor organizing the Telangana Grameen Mahotsav

హైదరాబాద్‌ : కస్టమర్ రీచ్ మరియు కనెక్షన్‌ని పెంపొందించాలనే తమ నిబద్ధతకు అనుగుణంగా, టొయోటా కిర్లోస్కర్ మోటర్, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దాని అధీకృత డీలర్‌ల సహకారంతో Read more

ఏపీలో మందుబాబుల‌కు గుడ్ న్యూస్
wine price

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మద్యం ధరలపై కీలక నిర్ణయాలు తీసుకుంటూ మద్యం బాబులకు గుడ్ న్యూస్ అందిస్తుంది. 3 బ్రాండ్ల మద్యం ధరలు తగ్గించింది. రాయల్ ఛాలెంజ్ గోల్డ్ Read more