విశాఖ డెక్కన్ క్రానికల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..

విశాఖలోని ‘డెక్కన్ క్రానికల్’ కార్యాలయంఫై టీడీపీ అనుబంధ సంఘాల కార్యకర్తలు దాడి చేశారు. ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి యూటర్న్’ అంటూ డెక్కన్ క్రానికల్ ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై ఆగ్రహం చెందిన TNSF, తెలుగు మహిళా శ్రేణులు పత్రిక కార్యాలయం ముందు నిరసన తెలిపి, బోర్డును తగలబెట్టాయి.

కూటమి ప్రభుత్వంపై తప్పుగా రాసిన వార్తను తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యాలయం లోపలకు చొచ్చుకుని వెళ్ళేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకారులను డీసీ కార్యాలయం సిబ్బంది అడ్డుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల రంగ ప్రవేశంతో ఆందోళనకారుల నిరసనను విరమించుకున్నారు. కాగా ఈ వీడియోను Xలో పోస్ట్ చేసిన డెక్కన్ క్రానికల్.. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేసింది.

.@JaiTDP goons attacked Deccan Chronicle office after we published an unbiased report on VSP privatisation

Intimidation tactics won’t silence us, @JaiTDP, @BJP4India, @JanaSenaParty
#PressFreedom #StandWithJournalism pic.twitter.com/RTh0rE0kMB— Deccan Chronicle (@DeccanChronicle) July 10, 2024