tata

సంక్షోభ సమయంలో నేనున్నాంటూ ముందుకు వచ్చిన ‘టాటా’

భారత్ ను వణికించిన ఘటనల్లో ముంబై ఉగ్రదాడి ఒకటి. టాటా గ్రూపునకు చెందిన తాజ్ హోటల్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో హోటల్ ధ్వంసమైంది. అయినప్పటికీ రతన్ టాటా ముందుండి మరింత దృఢంగా పునర్నిర్మించారు. దాడిలో గాయపడ్డ బాధితులతో పాటు హోటల్ సిబ్బందికి అండగా నిలిచి భరోసానిచ్చారు.

కరోనా సమయంలోనూ తన వంతు సాయంగా రూ.1,500 కోట్ల భారీ విరాళం ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు. గొప్ప వ్యాపారవేత్తగానే కాకుండా సమాజ సేవకుడిగా ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టాటా మరణం దేశానికి పూడ్చలేని నష్టాన్ని మిగిల్చిందని, అలాంటి గొప్ప వ్యక్తిని మరల చూడలేమని కామెంట్లు చేస్తున్నారు. రతనీ అసలైన ‘భారతరత్న’మని కొనియాడుతున్నారు. రతన్ 1991లో టాటా గ్రూప్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎప్పుడూ దేశానికి తొలి ప్రాధాన్యం ఇచ్చేవారు. బాధ్యతలు స్వీకరించిన సమయంలో కంపెనీ రెవెన్యూ రూ.10వేల కోట్లుగా ఉంది. తర్వాత అంతర్జాతీయ స్థాయిలో టాటా గ్రూపును విస్తరించారు. స్టీల్, ఆటో మొబైల్ వంటి రంగాల్లో విస్తృతపరిచారు. కంపెనీ బ్రాండ్ వాల్యూను కొనసాగిస్తూ చేపట్టిన సంస్కరణలతో పదవి నుంచి దిగిపోయే సరికి రెవెన్యూను రూ. లక్ష కోట్లకు చేర్చారు.

Related Posts
తమిళనాడు అసెంబ్లీలో జాతీయ గీతం వివాదం
తమిళనాడు అసెంబ్లీలో జాతీయ గీతం వివాదం

సంవత్సరం మొదటి సెషన్ ప్రారంభం రోజున రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సంప్రదాయ ప్రసంగాన్ని అందించకుండా గవర్నర్ ఆర్‌ఎన్ రవి వాకౌట్ చేశారు. జాతీయ గీతం మరియు రాజ్యాంగం Read more

భూముల రీ-సర్వే.. గ్రామసభల్లో 41వేల ఫిర్యాదులు
Re survey of lands. 41 tho

ఆంధ్రప్రదేశ్ లోని భూములపై రీ-సర్వే నిర్వహిస్తున్న గ్రామ సభల్లో ఇప్పటి వరకు 41,112 ఫిర్యాదులు అందాయి. భూ విస్తీర్ణాల తగ్గింపు, పత్రాల్లో తప్పులు, చనిపోయిన వారి పేర్ల Read more

రతన్ టాటా మరణంపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
Israeli Prime Minister Netanyahu reacts to the death of Ratan Tata

న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణంపై ప్రపంచ దేశాల అధినేతలు సంతాపాలు తెలియజేస్తున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమన్ నెతన్యాహు స్పందించారు. భారత్-ఇజ్రాయెల్ మధ్య Read more

సైఫ్ అలీ ఖాన్ దాడిపై సంచలన నిజాలు.
సైఫ్ అలీ ఖాన్ దాడిపై సంచలన నిజాలు.

సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్: సంచలన నిజాలు వెలుగు బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన ఘటనకు సంబంధించి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *