ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలి విగ్రహం.. సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఘటన చోటుచేసుకున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో తాజాగా మృతురాలికి నివాళిగా ఓ అమ్మాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అది బాధితురాలిని అగౌరపర్చేలా ఉందంటూ పలువురు నెట్టింట విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఆసిత్ సైన్ అనే శిల్పి ఈ మహిళ విగ్రహాన్ని రూపొందించారు. హత్యాచార సమయంలో బాధితురాలు అనుభవించిన క్షోభను ప్రతిబింబించేలా…