లతా రజనీకాంత్‌కు ప్రధాని మోడీ ఫోన్.. రజనీకాంత్ ఆరోగ్యంపై ఆరా..!
న్యూఢిల్లీ: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థత కారణంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు వైద్యులు స్టెంట్ వేశారు. గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళంలో వాపు వచ్చిందని, దాంట్లో స్టెంట్ అమర్చినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపాయి. మరో రెండు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వెల్లడించాయి. ఇక సూపర్ స్టార్ ఆసుపత్రిలో చేరడంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆయన…