లడ్డూ వివాదం.. నేడు తిరుమలకి పవన్ కల్యాణ్
అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. హిందూ మతానికి సంబంధించిన సనాతనధర్మం గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు. సనాతనధర్మాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన కోరుతున్నారు. మరోవైపు, తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వంపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మ పరిరక్షణ కోసం సనాతనధర్మ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెపుతున్నారు….