నాంపల్లి లో గొడ్డలితో దుండగుల దాడి.. పోలీసుల కాల్పులు

హైదరాబాద్లో కాల్పుల కలకలం రేగింది. నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. అందులో ఒకరు గొడ్డలితో దాడి చేయబోగా మరో వ్యక్తి రాళ్లు విసిరి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన ఏఆర్ కానిస్టేబుల్ పారిపోతున్న వారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన గురువారం అర్థరాత్రి 1.15 గంటలకు నాంపల్లి రైల్వే స్టేషన్‌ దగ్గర చోటు చేసుకుంది. అయితే నిందితులను పట్టుకునేందుకు స్పెషల్‌ డికాయిటీ టీమ్‌ ప్రయత్నిచింది. పోలీసులపై దొంగలు ఎదురు దాడికి దిగడంతో కాల్పులు జరిపారు. ఇందులో రాజు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. నిందితులను చైన్ స్నాచర్లుగా అనుమానిస్తున్నారు. ఈ కాల్పులతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది..!. కాగా.. పట్టుబడ్డ వారిలో అనీస్ రాజ్‌తో పాటు మరో ఇద్దరు నిందితులున్నారు.

ఇదిలా ఉండగా, చైన్‌ స్నాచర్ల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒక వైపు దొంగల ముఠాలు ఇళ్లల్లో చొరబడి దొచుకుంటుంటే.. మరో వైపు ఈ చైన్‌ స్నాచర్లు పెరిగిపోతున్నారు. వారిని అరికట్టేందుకు పోలీసులు అనునిత్యం ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఇందులో భాగంగా నాంపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద ఈ దొంగలను పట్టుకునే ప్రయత్నిం చేశారు పోలీసులు. దీంతో వారు పోలీసులపైనే కత్తులు, గొడ్డళ్లతో ఎదురు దాడికి దిగేందుకు ప్రయత్నించగా, పోలీసులు కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.