ఫస్ట్ హీరోయిన్ తో డిప్యూటీ సీఎం పవన్

పవన్ కల్యాణ్ తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఇందులో ఆయన సరసన సుప్రియ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతోనే టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది..ఇదే ఆమెకు ఫస్ట్ సినిమా..లాస్ట్ సినిమా. తర్వాత ఆమె నిర్మాతగా మారారు. కాగా ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ తో తాజాగా నిర్మాతలు భేటీ అయ్యారు. ఈ భేటీ లో సుప్రియ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె పవన్ తో ఫోటో దిగారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

పవన్ కళ్యాణ్‌తో నేడు తెలుగు సినీ నిర్మాత‌లు నేడు భేటి అయ్యారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన సమావేశం జరిగింది. కొత్త‌గా ఎన్నికైన ప్ర‌భుత్వానికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు తెలుగు సినీ నిర్మాతలు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ స‌మ‌వేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు. అలాగే, సినిమా టిక్కెట్ల ధర పెంపు విషయంలో చర్చించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఇక ఈ భేటిలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదరప్రసాద్, నిర్మాతలు అల్లు అరవింద్, సి అశ్వినీదత్, ఏ.ఎం. రత్నం, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య , సుప్రియ, ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ తదితరులు ఉన్నారు.