The Supreme Court

అస్సాం సర్కార్ పై సుప్రీం కోర్టు అగ్రహం

ప్రభుత్వాల పనితీరులపై సుప్రీంకోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా వాటి పనితీరులో మార్పులు వుండడం లేదు. దీనితో కోర్టుల ఆగ్రహానికి గురికావలిసి వస్తుంది. తాజాగా అస్సాం ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మతియా తాత్కాలిక శిబిరంలో 270 మంది విదేశీయులను నిర్బంధించడానికి గల కారణాలు చెప్పకపోవడంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. తదుపరి విచారణకు అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరుకావాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓక్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లోపభూయిష్టంగా ఉందని, తాము కోరిన వివరాలు అందులో లేవని బుధవారం జరిగిన విచారణ సందర్భంగా ధర్మాసనం మండిపడింది. డిసెంబర్ 9న విచారణ సమయంలో విదేశీయుల నిర్బంధానికి గల కారణాలు తెలుపడంతో పాటు వారిని దేశం నుంచి పంపించి వేయడానికి తీసుకుంటున్న చర్యలు తెలియజేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఇందుకు ఆరు వారాల సమయం ఇచ్చింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో ఆ వివరాలు ఏమీ లేవని, విదేశీయులను ఇంకా నిర్బంధ శిబిరాల్లోనే కొనసాగించేందుకు సరైన వివరణ ఇవ్వలేదని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరిగాలేదని ధర్మాసనం ఆక్షేపించింది.

Related Posts
బెంగళూరులో సామాన్యులకు గడ్డుకాలమే!
Bangalore city

బెంగళూరులో ఏ మూలకు వెళ్లినా మన తెలుగోళ్లు కనిపిస్తూనే ఉంటారు. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు ప్రస్తుతం సామాన్య ప్రజలు నివసించటానికి అందుబాటులో లేని నగరంగా Read more

Etihad Airways: ఎతిహాద్ ఎయిర్‌వేస్ బంపర్ ఆఫర్: భారతీయులకు 30% డిస్కౌంట్!
ఎతిహాద్ ఎయిర్‌వేస్ బంపర్ ఆఫర్: భారతీయులకు 30% డిస్కౌంట్!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జాతీయ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్‌వేస్ భారతీయ ప్రయాణికులకు ప్రత్యేక డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ వేసవిలో ఎతిహాద్ విమానాల్లో ప్రయాణించే భారతీయులకు Read more

బీసీకి డిప్యూటీ సీఎం పదవి.. సీఎం రేవంత్ కీలక ఆలోచన?
1488570 cm revanth reddy

తెలంగాణ రాజకీయాల్లో బీసీల ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర కేబినెట్ విస్తరణలో బీసీలకు పెద్దపీట వేయాలని భావిస్తున్న Read more

మళ్లీ వార్తల్లోకి వచ్చిన ముద్రగడ
mudragada

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి వార్తల్లో నిలిచాడు. అప్పట్లో ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచినా Read more