కేరళ, పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ కార్యాలయాలకు సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court

న్యూఢిల్లీ : కేరళ , పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల గవర్నర్‌ కార్యాలయాలకు సుప్రీంకోర్టు ఈరోజు(శుక్రవారం) నోటీసులు జారీ చేసింది. తాము ప్రతిపాదించిన పలు బిల్లులు గవర్నర్‌ వద్ద పెండింగ్‌ లో ఉన్నాయని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక ఇదే అంశంపై బెంగాల్‌ ప్రభుత్వం కూడా దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేసింది.

రాష్ట్రపతికి పంపించాల్సిన పలు బిల్లులకు గవర్నర్లు ఆమోదం తెలపకుండా పెంగింగ్‌లో ఉంచారంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ తమ పిటిషన్‌లో పేర్కొన్నాయి. ఏడాదికిపైగా సుమారు 8 బిల్లులను పెండింగ్‌లో పెట్టారని.. అందుకు గల కారణాలను కూడా వెల్లడించట్లేదని తెలిపాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పరిద్వాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడి ధర్మాసనం ఆయా గవర్నర్‌ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది.