suman bcm

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న సుమన్

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని శుక్రవారం సినీ నటుడు సుమన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు సుమన్ను ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సుమన్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గతంలో సుమన్ శ్రీరామరాజ్యం మూవీ లో శ్రీరాముడి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. చిత్రసీమలో సుమన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక నిన్న గురువారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం సుమన్ కుటుంబ సభ్యులకు అర్చక పండితులు వేదాశీర్వచనం పలికారు.ఇక ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట ఆలయాన్ని మాజీ సీఎం కేసీఆర్ మహాద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. పునర్నిర్మాణం ముందు ఈ ఆలయం ఎలా ఉండేదో నాకు తెలుసని, కేసీఆర్ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆలయాన్ని చాలా అందంగా అద్భుత శిల్పకళతో నిర్మింపచేశారని మెచ్చుకున్నారు.

ఎంతో మంది శిల్పులు పనిచేసి అద్భుత శిల్పాలను, గోపురాలను చెక్కారని, గుడిలోపలికి వెళ్తే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్లినట్లు ఉందన్నారు. ఇంత అద్భుతమైన గుడిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని, భవిష్యత్తులో యాదగిరిగుట్ట ఆలయం దేశ, విదేశాల్లో మరింత ఖ్యాతిని పొందుతుందని తెలిపారు.

Related Posts
వార్షిక అవార్డులను ప్రకటించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్
వార్షిక అవార్డులను ప్రకటించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సినీ పరిశ్రమకు చెందిన నటులు, నిపుణులకు ప్రతి ఏడాది అవార్డులు అందజేయాలని నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 6న హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో Read more

సైఫ్ అలీఖాన్ పై దాడి
Attack on Saif Ali Khan

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడడంతో వెన్తనె కుటుంబసభ్యులు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం Read more

కుంభమేళాలో ‘అఖండ-2’ షూటింగ్
కుంభమేళాలో 'అఖండ 2' షూటింగ్

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'అఖండ 2: తాండవం ". ఇంటర్నెట్లో ప్రసారమవుతున్న నివేదికలు మరియు వీడియోల ప్రకారం, బోయపాటి బృందం ప్రయాగ్రాజ్లోని మహాకుంభ Read more

‘గేమ్ ఛేంజర్’ పబ్లిక్ టాక్
game changer talk

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కలయికలో తెరకెక్కిన భారీ బ‌డ్జెట్ చిత్రం 'గేమ్ చేంజర్'. ఈ మూవీ లో రామ్ చరణ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *