ఇలాంటి విమర్శలు ఊహించలేదు : ఊర్వశి రౌతేలా

ఇలాంటి విమర్శలు ఊహించలేదు : ఊర్వశి రౌతేలా

బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వం వహించిన చిత్రం ‘డాకు మహారాజ్’ . ప్రగ్యా జైస్వాల్.శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు.ఊర్వశి రౌతేలా అతిథి పాత్ర పోషించారు. ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందించగ. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదలైన ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని అంచనా. ఇందులో బాలయ్య తో కలిసి ఆమె ‘దబిడి దిబిడి’ అంటూ సాగే ఈ పాటకు డాన్స్ చేసారు. పాట విడుదలైన సమయం లో కొరియోగ్రఫీ పై వచ్చిన వివాదం గురించి తాజా గా ఆమె స్పందించారు. ప్రేక్షకుల నుండి ఈ విధమైన స్పందన తాను ఊహించలేదని , పాట అందులోని స్టెప్పులను ప్రేక్షకులు ఆదరిస్తారనుకున్నాని చెప్పారు.కానీ , ఈ విధంగా మాట్లాడుతారని అనుకోలేదని తెలిపారు.


రిహార్సల్స్ అంతా ప్రశాంతంగా జరిగింది . అన్ని పాటలకు ఏ విధంగా కొరియోగ్రఫీ ఉంటుందో అదే విధంగా ఈ పాటకు చేశాం. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేసారు.నాలుగుసార్లు ఆయనతో కలిసి వర్క్ చేశాను. ఆయన స్టెప్పులు చెప్పినప్పుడు ఇబ్బందిగా అనిపించలేదు. సాధారణమైన స్టెప్పుల లానే భావించా. పాట విడుదలయ్యాక సోషల్ మీడియా లో వచ్చిన విమర్శలు చూసి షాకయ్యా. కొరియోగ్రఫీ ని ప్రేక్షకులు తప్పుపట్టడానికి కారణం ఏమిటో అంచనా వేయడానికి కూడా సమయం లేదు. ఈ వివాదంపై ఊర్వశి మాట్లాడుతూ ఒక సినిమా విజయం సాధించినప్పుడు దానిపై విభిన్న అభిప్రాయాలు, కథనాలు వ్యక్తం అవుతాయి. రిహార్సల్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి విమర్శలు వస్తాయని అస్సలు ఊహించలేదని, రిహార్సల్స్ క్లిప్స్ విడుదల చేసినపుడు ఎలాంటి విమర్శలు రాలేదని ,ఆమె తెలిపారు . డాకు మహారాజ్ సినిమాకి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ, బాలకృష్ణ మాస్ అప్పీల్, బాబీ డియోల్ విలన్ రోల్, థమన్ మ్యూజిక్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి.డాకు మహారాజ్ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్నప్పటికీ, ఓటీటీ విడుదలపై ఇంకా స్పష్టత లేదు. ముందుగా ఫిబ్రవరి 9న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు వచ్చినా, అది కార్యరూపం దాల్చలేదు. తాజా సమాచారం ప్రకారం, ఇతర భాషల డబ్బింగ్ పనులు ఇంకా పూర్తికాకపోవడం వల్ల, ఓటీటీ విడుదల ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియా ట్రోల్స్ పై ఊర్వశి స్పందన

“సోషల్ మీడియాలో కొంతమంది కావాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు. నేను వాటిని పట్టించుకోను. కానీ, వివరణాత్మక విమర్శలను మాత్రం స్వీకరిస్తాను. ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవించాలి. అయితే, కావాలని చేసిన నెగటివ్ ట్రోల్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అని తెలిపారు. ఊర్వశి రౌతేలా ‘దబిడి దిబిడి’ పాటపై వచ్చిన విమర్శలను ఖండించినప్పటికీ, కొందరు ప్రేక్షకులు మాత్రం దీనిపై ఇంకా విమర్శలు చేస్తున్నారు.

Related Posts
మహదేవ్‌ శాస్త్రిగా మోహన్‌ బాబు
mohan babu kannappa

కన్నప్ప 2024లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్‌ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం Read more

యష్ పుట్టినరోజు: అభిమానులకు విజ్ఞప్తి
యష్ పుట్టినరోజు: అభిమానులకు విజ్ఞప్తి

కన్నడ చిత్రపరిశ్రమలో స్టార్‌గా ఎదిగిన యష్, తన పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో అభిమానులంతా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.యష్ పుట్టినరోజు: అభిమానులకు విజ్ఞప్తి, 'కేజీఎఫ్' ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా Read more

సినిమాల్లోకి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి
Congress leader Jagga Reddy to enter films

హైదరాబాద్‌: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ… రాజకీయాల్లో ఫైట్ చేస్తానని.. తాను సింపతీ Read more

జైలు ఊచలు లెక్కపెడుతున్న తెలుగు యూట్యూబర్
fun bhargav

తెలుగు యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌పై మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో కోర్టు 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించింది. తీర్పు అనంతరం పోలీసులు Read more