Subramanya Swami: టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై స్పందించిన సుబ్రహ్మణ్యస్వామి

Subramanya Swami: టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై స్పందించిన సుబ్రహ్మణ్యస్వామి

తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) పరిధిలోని గోశాలలో గోవులు పెద్ద ఎత్తున మృతి చెందిన ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర ఆరోపణలు, జరుగుతున్నాయి.

Advertisements

భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

టీటీడీ మాజీ ఛైర్మన్ మరియు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఈ అంశాన్ని మొదట బయటపెట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గోశాలలో అనేక గోవులు మృతి చెందినట్లు వెల్లడించారు. గోవుల మరణానికి సంబంధించిన పోస్టుమార్టం జరగలేదని, ఇది పాలకుల నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నదని అన్నారు. గోశాల నిర్వహణ బాధ్యత డీఎఫ్ఓ స్థాయి అధికారికి అప్పగించడాన్ని ఆయన తీవ్రంగా విస్మయించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి స్పందన

ఈ వివాదంపై బీజేపీకి చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి స్పందించారు. తనకు ఈ విషయం టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన ద్వారా తెలిసిందని చెప్పారు.  దీనిపై మరింత సమాచారం సేకరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ప్రకారం గోసంరక్షణ ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. పూర్తి సమాచారంతో త్వరలోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేస్తానని తెలిపారు. గోశాలకు ఎటువంటి సంబంధం లేని డీఎఫ్ఓ స్థాయి అధికారిని గోశాలకు ఇన్‌ఛార్జ్‌గా నియమించారని, దీనిపై విచారణ జరిపించాలని భూమన డిమాండ్ చేశారు. భూమన ఆరోపణలను పలువురు మంత్రులు ఖండించడంతో పాటు ఆయనపైనే తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

Read also: Purandeshwari : ముస్లింల ఓటు దుష్ప్రచారం చేస్తున్నారు: పురందేశ్వరి

Related Posts
ప్ర‌కాశం జిల్లాలో మళ్ళీ భూప్ర‌కంప‌న‌లు
earthquake

ఏపీలోని ప్ర‌కాశం జిల్లాను వ‌రుస భూప్ర‌కంప‌న‌లు వ‌ణికిస్తున్నాయి. జిల్లాలోని ముండ్ల‌మూరులో సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల ప్రాంతంలో మ‌రోసారి స్వ‌ల్పంగా భూమి కంపించింది. కాగా, జిల్లాలో ఇలా Read more

సీఎం చంద్రబాబుని కలిసిన ముస్లిం సంఘాలు
Muslim groups met CM Chandr

అంతర్జాతీయ ముస్లిం లా బోర్డు మరియు పలు ముస్లిం సంఘాలు కేంద్రం ప్రతిపాదించిన వర్ఫ్ చట్టానికి సంబంధించి సవరణలను వ్యతిరేకించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరాయి. ఈ సందర్భంగా Read more

ఆ తర్వాత తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది: నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman key comments on the economic situation of Telangana

బడ్జెట్‍‌లో తెలంగాణకు అన్యాయం జరగలేదు న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన నాటికి Read more

Ugadi : ఉగాది పచ్చడి రుచులలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు !
The health secrets hidden in the flavors of ugadi pachadi !

Ugadi : కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ, ఆధ్యాత్మికతను పెంపొందించుకునే పండుగ ఉగాది. ఈ పండుగ రోజు చేసుకునే ఉగాది పచ్చడి షడ్రుచులతో కూడి ఆరోగ్యానికి మేలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×