నూజివీడి ట్రిబుల్ ఐటీ యాజమాన్యం తీరు మారడం లేదు

నూజివీడి ట్రిబుల్ ఐటీలో దాదాపు 800 మంది విద్యార్థులు తీవ్ర ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆస్ప‌త్రిపాలైనా సంగతి తెలిసిందే. కలుషిత ఆహారం తినడం వల్ల విద్యార్థులు తీవ్ర‌మైనం జ్వ‌రం, వాంతులు, విరేచ‌నాలు, క‌డుపునొప్పి,త‌ల‌నొప్పితో క‌ళ్లు తిరిగి పడిపోతున్నారు. వారి ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు. ఇంకా హాస్పటల్స్ లలో చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. ఈ ఘటన ఫై ప్రభుత్వం సైతం యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినప్పటికీ యాజమాన్య తీరు మారడం లేదు. ఈనెల 23 నుంచి అనారోగ్య ప‌రిస్థితులు మొద‌లుకాగా, ఇప్ప‌టివ‌ర‌కు 1,194 మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గురై ఆస్ప‌త్రుల పాల‌య్యారు.

మంత్రి కొలుసు పార్థ‌సార‌థి ట్రిపుల్ ఐటీలో ప‌ర్య‌టించి కాలేజీ ప‌రిస‌రాలు, మెస్ ల‌ను త‌నిఖీ చేశారు. అనంత‌రం అధికారుల‌తో మెస్ నిర్వాహ‌కుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. కాలేజీ, మెస్ నిర్వ‌హ‌ణ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే మంత్రి వెళ్ల‌గానే ప‌రిస్థితి మ‌ళ్లీ మామూలైంది. భోజ‌నంలో ఏమాత్రం నాణ్య‌త క‌నిపించ‌డం లేదు. గురువారం ఉదయం కూడా అల్పాహారంలో పాడైన గుడ్లు, రుచీ పచీ లేని ఉప్మా పెట్టారు. మధ్యాహ్నం భోజనానికి మాడిపోయిన బెండకాయ కూర, నీళ్ల పెరుగే గ‌తి. ఆఖ‌రుకి అన్నంలోనూ నాణ్య‌త క‌రువే. తినే అన్నంలో పురుగులు కనిపించడం చూస్తుంటే ప‌రిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోంది. ఓపక్క విద్యార్థుల ఆరోగ్యం పాడవుతున్న..యాజమాన్య తీరు మారడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.