Student suicide in Sri Chaitanya College

శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌: షాద్ నగర్ కు చెందిన కౌశిక్ రాఘవ (17) హైదరాబాద్ మియాపూర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలోనే అతడే హాస్టల్ గదిలో శుక్రవారం అర్ధరాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యను కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కాలేజీ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.

కాగా, శ్రీచైత‌న్య క‌ళాశాల‌లో విద్యార్థుల‌ను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నార‌ని, మాన‌సిక ఒత్తిడిని త‌ట్టుకోలేక విద్యార్థులు అర్థాంత‌రంగా త‌నువులు చాలిస్తున్నార‌ని న‌వ తెలంగాణ విద్యార్థి శ‌క్తి సంఘం అధ్య‌క్షుడు ప‌వ‌న్ ఆరోపించారు. కాలేజీ యాజ‌మాన్యంపై త‌క్ష‌ణ‌మే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న అన్నారు.

ఇటీవల హైదరాబాద్‌లోని నిజాంపేట్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాజు-రాధిక దంపతులకు కుమారుడు జశ్వంత్‌గౌడ్‌ (17)తో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. జశ్వంత్‌గౌడ్‌ నిజాంపేట్‌ జర్నలిస్టు కాలనీలోని శ్రీచైతన్య బాలుర వసతిగృహంలో బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రాత్రి తోటి విద్యార్థులతో కలిసి పడుకున్నాడు. నవంబర్‌ 14 గురువారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో తోటి విద్యార్థులు నిద్రలేచి చూడగా గదిలోని సీలింగ్‌ ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరి వేసుకొని వేలాడుతూ కన్పించాడు. విషయాన్ని కళాశాల వార్డెన్‌కు తెలుపగా వెంటనే నిజాంపేట్‌లోని హోలిస్టిక్‌ దవాఖానకు తరలించారు. అప్పటికే జశ్వంత్‌గౌడ్‌ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీకి తరలించారు.

Related Posts
శ్రీకాళహస్తిపై భక్తుల ఫిర్యాదు: ఘాటుగా స్పందించిన నారా లోకేష్
శ్రీకాళహస్తిపై భక్తుల ఫిర్యాదు: ఘాటుగా స్పందించిన నారా లోకేష్

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరిగిన ఒక సంఘటనపై ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత, ఆంధ్రప్రదేశ్ సమాచార, సాంకేతిక మరియు కమ్యూనికేషన్ల Read more

నేడు వైసీపీ నేతలతో వైస్ జగన్‌ కీలక సమావేశం
ys Jagan will have an important meeting with YCP leaders today

అమరావతి: వైసీపీ నేతలతో ఈరోజు వైస్ జగన్‌ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు హాజరుకానున్నారు. పూర్తి Read more

ముంబైలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సచిన్ టెండూల్కర్
sachin vote

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, బిజినెస్ దిగ్గజాలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ.. ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. భారత Read more

ఉక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడి
ukraine russia

శుక్రవారం తెల్లవారుజామున రష్యా క్షిపణి దాడి కీవ్ నగరాన్ని దెబ్బతీసింది. ఈ దాడికి ప్రతిస్పందించిన వాయు రక్షణ వ్యవస్థ వలన కొంతవరకు క్షిపణి దాడిని అడ్డగించేందుకు ప్రయత్నం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *