ఆసరా పెన్షన్ల విషయంలో వెనక్కి తగ్గిన రేవంత్ సర్కార్

కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పింఛన్ రికవరీలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రికవరీ నోటీసులపై ప్రభుత్వం అధికారులకు క్లారిటీ ఇచ్చింది. సంక్షేమ ప‌థ‌కాల్లో అన‌ర్హులు ల‌బ్ది పొందిన‌ట్లు ప్ర‌భుత్వం దృష్టికి వ‌చ్చింది. అర్హుల‌కే ల‌బ్ది అందేలా త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌మైన మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేస్తాం. మార్గ‌ద‌ర్శ‌కాలు ఇచ్చే వ‌ర‌కు రిక‌వ‌రీ నోటీసులు ఇవ్వొద్దు అని ఉత్త‌ర్వుల్లో సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు.

గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం అనర్హులకు కూడా పింఛన్లు మంజూరు చేసిందని ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. పేద కుటుంబాలకు అందాల్సిన ఆసరా పింఛన్లు దుర్వినియోగం కావడంపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు, వారి కుటుంబ సభ్యులు, కుటుంబ పింఛన్లు పొందుతున్నవారు కూడా ఆసరా కింద పింఛన్లు తీసుకున్న వారిని గుర్తించిన సర్కార్..ఇప్పటివరకు తీసుకున్న పింఛన్ ను వెనక్కు ఇవ్వాలని నోటీసులు జారీ చేయడం తో వారంతా గగ్గోలు పెట్టారు. బిఆర్ఎస్ పార్టీ కూడా ప్రభుత్వం ఆదేశాలపై ఆగ్రహం వ్యక్తం చేయడం తో ప్రభుత్వం వెనక్కు తగ్గింది.