నమాజ్ సమయంలో దుర్గాపూజ ఆపేయండి: బంగ్లాదేశ్‌..!

Stop Durga Puja during Namaz: Bangladesh..!

ఢాకా: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల గొడవలు చినికి చినికి గాలివానగా మారి , తీవ్రమైన హింసకు దారి తీయడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి మన దేశానికి పారిపోయి వచ్చే పరిస్థితులు ఎదురయ్యాయి. హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత హిందువులపై దాడులు పెరిగాయి. ఆలయాలను ధ్వంసం చేశారు, హిందూ వ్యాపారులను హింస పెట్టారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతోంది. త్వరలో శరన్నవరాత్రులు ప్రారంభం కానుండడంతో…బంగ్లా ప్రభుత్వం..అక్కడి హిందూ సమాజం ముందు కీలకమైన ప్రతిపాదన ఉంచింది.

అజాన్, నమాజ్ సమయాల్లో దుర్గాపూజకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిలిపేయాలని… ముఖ్యంగా సంగీత వాయిద్యాలు, పాటలు పాడడం లాంటివి చేయకూడదన్నది ఆ ప్రతిపాదన సారాంశం… బంగ్లా దేశ్ హోం వ్యవహరాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) ఎండీ జహంగీర్ అలం చౌదరి స్వయంగా ఈ విజ్ఞప్తి చేశారు. నమాజ్ సమయంలో దుర్గా పూజ నిలిపేయాలని, అజాన్ కి ఐదు నిముషాల ముందే విరామం పాటించాలని కోరారు. సంగీత వాయిద్యాలు, సౌండ్ సిస్టమ్స్ ఆఫ్ చేయాలన్న విజ్ఞప్తులను హిందూ సంఘాలు అంగీకరించాయని చెప్పారు జహంగీర్ అలం. దుర్గా పూజ అంటే బంగ్లాదేశ్ లో హిందువులకు అతి పెద్ద పండుగ. ఈ మధ్య జరిగిన మత ఘర్షణలను పరిగణలోకి తీసుకుని బంగ్లా ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది.

ఈ ఏడాది బంగ్లా వ్యాప్తంగా 32,666 పూజా మండపాలను ఏర్పాటు చేయనున్నట్లు జహంగీర్ అలం చౌదరి తెలిపారు. వీటిలో 157 మండపాలు ఢాకా సౌత్ సిటీలో, 88 నార్త్ సిటీ కార్పొరేషన్లలో ఉంటాయని ఢాకా ట్రిబ్యూన్ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏర్పాటు చేస్తున్న దుర్గా మండపాల సంఖ్య ఎక్కువే. 2023 లో మండపాల సంఖ్య 33,431 కాగా….2024 లో 32,666 దుర్గా మండపాలు..