statue of a doctor in Rg Kar hospital. There are different opinions on social media

ఆర్జీకర్‌ ఆసుపత్రిలో వైద్యురాలి విగ్రహం.. సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు

statue of a doctor in Rg Kar hospital.. There are different opinions on social media
statue of a doctor in Rg Kar hospital.. There are different opinions on social media

కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఘటన చోటుచేసుకున్న ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో తాజాగా మృతురాలికి నివాళిగా ఓ అమ్మాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అది బాధితురాలిని అగౌరపర్చేలా ఉందంటూ పలువురు నెట్టింట విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

ఆసిత్ సైన్‌ అనే శిల్పి ఈ మహిళ విగ్రహాన్ని రూపొందించారు. హత్యాచార సమయంలో బాధితురాలు అనుభవించిన క్షోభను ప్రతిబింబించేలా రూపొందించిన ఆ విగ్రహానికి ‘క్రై ఆఫ్‌ ది అవర్‌’ అని పేరు పెట్టారు. దీన్ని ఇటీవల ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ ప్రాంగణంలోని ప్రిన్సిపల్‌ కార్యాలయానికి సమీపంలో ఏర్పాటు చేశారు. ”ఇది బాధితురాలి విగ్రహం కాదు. ఘటన సమయంలో ఆమె అనుభవించిన వేదన, హింసకు ప్రతీకగా దీన్ని ఏర్పాటు చేశాం” అని తెలిపారు. దీనికి సంబంధించిన చిత్రాలను కొందరు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడంతో ఇవి కాస్తా వైరల్‌గా మారాయి.

ఈ విగ్రహం ఏర్పాటు వెనుక ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. నెట్టింట దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ”ఇది బాధితురాలిని అవమానించడమే. ఓ అత్యాచార బాధితురాలిని ఆధారంగా చేసుకుని ఇలాంటి విగ్రహాలను ఎలా ఏర్పాటు చేస్తారు? ఇది మంచి సలహా అని ఎవరు చెప్పారు? దీన్ని ఎవరు ఆమోదించారు?” అంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు.

ఈ ఏడాది ఆగస్టు 9న కోల్‌కతా లోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో 31 ఏళ్ల జూనియర్‌ వైద్యురాలి సెమినార్‌ హాల్‌లో అర్ధనగ్న స్థితిలో విగత జీవిగా కన్పించిన సంగతి తెలిసిందే. ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనకు పాల్పడిన సివిల్‌ వాలంటీర్‌ సంజయ్‌ రాయ్‌ని అరెస్టు చేశారు. ప్రస్తుతం దీనిపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు, ఈ ఘటనను నిరసిస్తూ కోల్‌కతాలో జూనియర్‌ వైద్యుల ఆందోళన కొనసాగుతోంది.

Related Posts
ఇండోర్‌లోనే ట్రంప్ ప్రమాణం
Trump inauguration swearing in to be moved indoors due to cold

న్యూయార్క్‌ : ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవం ఇండోర్‌లో జరగనుంది. వాషింగ్టన్ డీసీలో విపరీతమైన చలి ఉండటంతో క్యాపిటోల్ భవనంలో ప్రమాణం Read more

నేడు సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ
Deputy CM Pawan Kalyan meet CM Chandrababu today

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం ఒంటి గంటకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు, పలు ఇతర Read more

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024
Amazon Great Indian Festival 2024

ద అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024లో 140 కోట్ల మంది కస్టమర్లు సందర్శించారు - ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్య ఇది! Read more

నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం..
Today is International Mens Day

న్యూఢిల్లీ: నేడు అనగా 19 నవంబర్ 2024, అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకుంటున్నారు. సమాజంలో పురుషుల సహకారాన్ని ప్రశంసించే లక్ష్యంతో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కుటుంబం, Read more