State revenue to grow by 2.2 percent.. CM Chandrababu

CM Chandrababu : రాష్ట్ర ఆదాయంలో 2.2 శాతం మేర వృద్ధి : సీఎం చంద్రబాబు

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సీఎం చంద్రబాబు ఆదాయార్జన శాఖ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ఆదాయంలో 2.2 శాతం మేర వృద్ధి నమోదైనట్లు పేర్కొన్నారు. ఏపీ సొంత ఆదాయ వనరులు పెరిగితేనే అసలైన వృద్ధి ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. పన్ను ఎగవేతలకు ఏఐ(AI)తో చెక్ పెట్టాలని అధికారులకు సూచించారు.

Advertisements
రాష్ట్ర ఆదాయంలో 2.2 శాతం మేర

కొత్త పాలసీతో 33% పెరిగిన ఎక్సైజ్‌ శాఖ ఆదాయం

రాష్ట్ర ఆదాయ లక్ష్యం రూ.1.37 లక్షల కోట్ల సాధనపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో కొత్త పాలసీతో 33% పెరిగిన ఎక్సైజ్‌ శాఖ ఆదాయం, మున్సిపల్‌ శాఖలో ఇంకా రూ.2,500 కోట్ల బకాయిలు ఉన్నాయని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. పన్నుల చెల్లింపుల దగ్గర నుంచి రశీదులు, నోటీసులు జారీ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో జరగాలని చెప్పారు. మున్సిపల్ శాఖ ఇచ్చిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా రాష్ట్రంలో వెయ్యి మందికి పైగా బిల్డర్లు అసలు రిజిస్టర్ కాలేదని ఏఐ గుర్తించింది.

ఎగవేతదారులను పసిగట్టేందుకు ఏఐని వాడాలి

అయితే, తప్పనిసరిగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రభుత్వం ఎటువంటి ఆమోదాలైనా తెలపాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. పన్ను ఎగవేతదారులను పసిగట్టేందుకు ఏఐని వినియోగించుకోవాలని చెప్పారు. అన్ని ఆదాయార్జన శాఖల్లోనూ ఇదే తరహా ప్రక్రియ అమలు చేసి పకడ్బందీగా పన్ను వసూళ్లు చేయాలన్నారు. టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా వ్యాపారులకు పన్ను చెల్లింపులు, అనుమతులు వంటివి సులభతరం అవుతున్నాయనే విషయాన్ని వారికి తెలియజేయాలన్నారు.

Related Posts
జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ – 2025 ప్రారంభం
National Karate Championship 2025 Commencement

హైదరాబాద్: జపాన్ కారాటే అసోసియేషన్ ఇండియా అద్వర్యం లో హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదిక ఐదు రోజులపాటు నిర్వహించనున్న మొదటి జేకేఏ ఇండియా ఇన్విటేషనల్ ఇంటర్నేషనల్ Read more

ప్రపంచ బ్యాంక్ చీఫ్ జోక్: మోదీ, మాక్రాన్‌ల మధ్య స్నేహపూర్వక వాతావరణం
india french

ప్రపంచ బ్యాంక్ చీఫ్ అజయ్ బంగా , బ్రెజిల్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ కార్యక్రమంలో ప్రపంచ నాయకులను నవ్వులతో ఆకట్టుకున్నారు. ఆయన "ఒక భారతీయుడి నుండి మరొకరికి" Read more

Karantaka Assembly: మగాళ్లకి వారానికి రెండు బాటిళ్లు ఫ్రీ గా ఇవ్వండి : ఎమ్మెల్యే అభ్యర్థన
Give men two free bottles a week.. MLA request

Karantaka Assembly : కర్ణాటక అసెంబ్లీలో ఎక్సైజ్ రెవిన్యూ ఎలా పెంచాలన్న దానిపై జరిగిన చర్చ.. మద్యం బాటిళ్లు ఉచితంగా అందించాలనే దానిపైకి వెళ్లింది. ఓ సీనియర్ Read more

Tamilasai: తమిళిసై తండ్రి కన్నుమూత
Tamilasai: తమిళిసై తండ్రి కన్నుమూత

తెలంగాణ మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.తమిళిసై సౌందరరాజన్ తండ్రి, తమిళనాడు కాంగ్రెస్ మాజీ చీఫ్ కుమారి అనంతన్ (93). అనారోగ్యం, Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×