State budget does not address the problems of the poor..KTR

TG Budget : రాష్ట్ర బడ్జెట్‌ పేదల కష్టాలను తీర్చేలా లేదు : కేటీఆర్‌

TG Budget: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ బడ్జెట్‌ పై స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. ఈ బడ్జెట్‌ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి పేక మేడలా కూల్చిందని ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పేదల కష్టాలను తీర్చేలా లేదని మండిపడ్డారు.

Advertisements

420 హామీలను బడ్జెట్‌లో ఎక్కడా లేవు

ఈ బడ్జెట్ ఢిల్లీకి మూటలు పంపేందుకు మాత్రమే ఉపయోగపడేలా ఉందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలను బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. రుణమాఫీ జరిగిందో లేదో కాంగ్రెస్ వాళ్లకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అంకెలు ఎందుకు మారాయో సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు. పదేళ్ల ప్రగతి రథ చక్రానికి పంక్చర్ చేశారని కేటీఆర్‌ దుయ్యబట్టారు. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌ను మోసం చేసేలా ఈ బ‌డ్జెట్ ఉంద‌ని మండిప‌డ్డారు.

ఆరు గ్యారెంటీల ఊసే లేదు

ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీతో పాటు ఆరు గ్యారెంటీల ఊసే లేద‌ని కేటీఆర్ విరుచుకుప‌డ్డారు. ఈ రోజు రాష్ట్రంలోని పేద‌లు, రైతులు, ఆడ‌బిడ్డ‌లు అంద‌రూ కూడా ఆశ‌గా ఎదురు చూశారు. కానీ ఒక్క మాట‌లో చెప్పాలంటే భ‌ట్టి విక్ర‌మార్క సుదీర్ఘ ఉప‌న్యాసం విన్న త‌ర్వాత మాకు అర్థ‌మైందంటే ఆరు గ్యారెంటీలు గోవిందా గోవిందా అని అర్థ‌మైంది. ఆరు గ్యారెంటీల‌కు తిలోద‌కాలు వేశారు, పాత‌రేశార‌ని స్ప‌ష్టంగా అర్థ‌మైంది. ఇది కాంగ్రెస్‌కు రెండో బ‌డ్జెట్‌. ఈ బ‌డ్జెట్‌ను చూసిన త‌ర్వాత మ‌హిళ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారని కేటీఆర్‌ అన్నారు.

Related Posts
Ashwini Vaishnaw : 1410 గేమింగ్ సైట్లను నిషేధించిన కేంద్రం
Ashwini Vaishnaw 1410 గేమింగ్ సైట్లను నిషేధించిన కేంద్రం

Ashwini Vaishnaw : 1410 గేమింగ్ సైట్లను నిషేధించిన కేంద్రం ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.ఈ అంశానికి సంబంధించి రాష్ట్రాలు తమ Read more

ఫ్యూచర్‌ సిటీలో 56 గ్రామాలు ఎక్కడంటే?
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ – రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగర విస్తరణపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ దక్షిణ భాగంలో కొత్త నగరాన్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది. దీనిలో Read more

వైస్ షర్మిల కు వార్నింగ్ ఇచ్చిన కళ్యాణి
sharmila dharna

కడప జిల్లాకు చెందిన వైసీపీ సోషల్ మీడియా వర్కర్ వర్రా రవీంద్రారెడ్డి భార్య కల్యాణి.. వైఎస్ షర్మిళను తీవ్రస్థాయి లో హెచ్చరించారు. కడప జిల్లా పోలీసులు వర్రా Read more

నేడు అందుబాటులోకి టెన్త్ హాల్ టికెట్లు
Tenth Hall Tickets Available Today

హైదరాబాద్‌: తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌.. పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లను ఇవాళ వెబ్‌సైటులో అందుబాటులోకి తీసుకురానుంది. https://bse.telangana.gov.in/ సైట్‌లో విద్యార్థులు లాగిన్‌ అయి Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×