The details of the deceased

తిరుపతిలో తొక్కిసలాట.. మృతుల వివరాలు

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద బుధువారం జరిగిన తొక్కిసలాట ఘటనా అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చిన కారణంగా గందరగోళం చోటుచేసుకొని తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.

ఈ దుర్ఘటనలో నర్సీపట్నానికి చెందిన నాయుడుబాబు (51), విశాఖకు చెందిన రజిని (47), లావణ్య (40), శాంతి (34), కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల (50), తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ (49) మృతి చెందారు. ఈ మృతుల కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి. ఈ తొక్కిసలాటలో మరో 40 మంది భక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే తిరుపతి గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అధికారులు పరిస్థితిని పర్యవేక్షించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. భక్తుల అధిక సంఖ్య, నిర్వాహకుల వైఫల్యం, సరైన భద్రతా చర్యల లేకపోవడం వంటి అంశాలు ప్రాథమికంగా వెల్లడయ్యాయి.

Related Posts
కిమ్స్‌లో 100 రోబోటిక్ విప్పల్ శస్త్రచికిత్సలు
100 Robotic Whipple Surgeries in Kim's

హైదరాబాద్‌: కిమ్స్ హైదరాబాద్‌లోని ప్రముఖ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఒకటి. అత్యంత క్లిష్టమైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లను 100 రోబోటిక్-సహాయక విప్పల్ తోటి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసిన భారతదేశంలో Read more

ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఏపీ ప్రభుత్వం శుభవార్త
Contract employees

ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ వైద్య ఆరోగ్య సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి Read more

10వ రోజు జూనియర్ డాక్టర్ల నిరవధిక నిరాహార దీక్ష
RG Kar issue. Junior doctors hunger strike enters 10th day

కోల్‌కతా : కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు గత 10 రోజులుగా నిరాహార దీక్షకు దిగారు. దీంతో Read more

ర్యాగింగ్ ఘటనపై సమంత, కీర్తి సురేశ్ స్పందించారు
ర్యాగింగ్ ఘటనపై సమంత, కీర్తి సురేశ్ స్పందించారు

సమంత, గతంలో సినిమాల విషయంలో బిజీగా ఉండగా, ఇప్పుడు మరింత సెలెక్టివ్‌గా ఎంపిక చేస్తున్నది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి తన Read more