Srikakulam youth trapped in Saudi Arabia

సౌదీ అరేబియాలో చిక్కుకున్న శ్రీకాకుళం యువకులు..

సౌదీ అరేబియాలో ఉపాధి కోసం వెళ్లిన శ్రీకాకుళం జిల్లా యువకుల అవస్థలు..

శ్రీకాకుళం : సౌదీలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి మండలాలకు చెందిన యువకులు. కంబస్ పరిశ్రమలో ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి లక్షా 20వేలు తీసుకుని 16 మందిని ఏజెంట్లు సౌదీకి పంపారు. సౌదీలో 2 నెలలుగా కష్టపడి పనిచేసినా యాజమాన్యం జీతాలు చెల్లించకపోవడంతో తినడానికి తిండి, తాగునీరు లేక సౌదీలో యువకులు అవస్థలు పడుతున్నారు. ఏజెంట్లకు ఫోన్ చేసినా స్పందించడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సౌదీలో తమ కష్టాలను వివరిస్తూ బాధితులు కుటుంబ సభ్యులకు వీడియో పంపారు.

విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన వలస కూలీలకు అండగా ఉంటానని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. వీడియో కాల్ ద్వారా బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విదేశాంగ మంత్రితో మాట్లాడి బాధితులందరినీ స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తానని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.

Related Posts
సైఫ్ అలీఖాన్ పై దాడి
Attack on Saif Ali Khan

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడడంతో వెన్తనె కుటుంబసభ్యులు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం Read more

దావోస్ లో రేవంత్ తొలి ఒప్పందం
దావోస్ లో రేవంత్ తొలి ఒప్పందం

తెలంగాణ ప్రభుత్వం దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో తన తొలి పెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రఖ్యాత వినియోగ వస్తువుల తయారీ సంస్థ యూనిలీవర్‌తో రాష్ట్రానికి పెట్టుబడులపై Read more

భారతదేశానికి వ్యతిరేకంగా ట్రూడో ఆరోపణలు: పతనానికి మలుపు?
భారతదేశానికి వ్యతిరేకంగా ట్రూడో ఆరోపణలు: పతనానికి మలుపు?

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రస్తుతం తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఆయన రాజీనామాకు దారితీయవచ్చు. లిబరల్ పార్టీలో ఒంటరిగా మారిన ట్రూడో, క్షీణిస్తున్న Read more

Narendra Modi: వచ్చే నెలలో అమరావతికి రానున్న మోదీ
అమరావతిలో మోదీ పర్యటన – లక్ష కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం!

అమరావతి మరోసారి చరిత్ర సృష్టించనుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. ఏప్రిల్ 15 నుండి 20వ తేదీ మధ్య ఆయన Read more