Srikakulam youth trapped in Saudi Arabia

సౌదీ అరేబియాలో చిక్కుకున్న శ్రీకాకుళం యువకులు..

సౌదీ అరేబియాలో ఉపాధి కోసం వెళ్లిన శ్రీకాకుళం జిల్లా యువకుల అవస్థలు..

శ్రీకాకుళం : సౌదీలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి మండలాలకు చెందిన యువకులు. కంబస్ పరిశ్రమలో ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి లక్షా 20వేలు తీసుకుని 16 మందిని ఏజెంట్లు సౌదీకి పంపారు. సౌదీలో 2 నెలలుగా కష్టపడి పనిచేసినా యాజమాన్యం జీతాలు చెల్లించకపోవడంతో తినడానికి తిండి, తాగునీరు లేక సౌదీలో యువకులు అవస్థలు పడుతున్నారు. ఏజెంట్లకు ఫోన్ చేసినా స్పందించడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సౌదీలో తమ కష్టాలను వివరిస్తూ బాధితులు కుటుంబ సభ్యులకు వీడియో పంపారు.

విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన వలస కూలీలకు అండగా ఉంటానని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. వీడియో కాల్ ద్వారా బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విదేశాంగ మంత్రితో మాట్లాడి బాధితులందరినీ స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తానని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.

Related Posts
మలేసియా, దక్షిణ థాయిలాండ్ లో తీవ్ర వరదలు
floods scaled

మలేసియా మరియు దక్షిణ థాయిలాండ్ లో తీవ్ర వరదలు ప్రజల జీవితాలను గందరగోళం చేయడంతో పాటు, ఆర్థికంగా కూడా పెద్ద నష్టాన్ని కలిగించాయి. ఈ వరదలు మొత్తం Read more

కొనసాగుతున్న అల్లు అర్జున్ విచారణ
Alluarjun CP

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరయ్యారు. తన నివాసం నుంచి బయలుదేరిన బన్నీ, స్టేషన్‌కు చేరుకుని లాయర్ సమక్షంలో ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. Read more

అమరావతి అభివృద్ధికి 50 వేల కోట్లు: సీఎం
అమరావతి అభివృద్ధికి 50 వేల కోట్లు: సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణ పనులు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. అమరావతి చుట్టూ 183 కిలోమీటర్ల విస్తీర్ణంలో Read more

ఆలుబాక శివారులో పెద్దపులి సంచారం
tiger

వెంకటాపురం మండలం ఆలుబాక శివారులో పెద్దపులి సంచరిస్తున్న వార్త స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఆలుబాక-బోధాపురం మార్గంలో గోదావరి పాయ దగ్గర పులి అడుగుల జాడలు కనిపించడంతో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *