కొనసాగుతున్న శ్రీలంక అధ్యక్షుడు ఎన్నికల పోలింగ్

Sri Lanka ongoing presidential election polling

శ్రీలంక : ఎన్నికల అనంతర కాలంలో దేశంలో శాంతి, సుస్థిరతలను నెలకొల్పేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే భద్రతా సంస్థ చీఫ్‌లను ఆదేశించినట్లు ప్రెసిడెన్షియల్ మీడియా విభాగం (పీఎండీ) తెలిపింది. అధ్యక్ష ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై చర్చించేందుకు జాతీయ భద్రతా మండలి సమావేశమైందని పీఎండీ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూసుకోవడంపై కౌన్సిల్ దృష్టి సారించింది. అదే సమయంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఎన్నికల కమిషన్‌కు పూర్తి మద్దతునిస్తుందని హామీ ఇచ్చింది.

ప్రధాన చర్చల్లో అభ్యర్థుల భద్రత, పోలింగ్ స్టేషన్ల భద్రత, పోలింగ్ స్టేషన్ల వద్ద భద్రతను నిర్వహించడం వంటి అంశాలు ఉన్నాయని పీఎండీ పేర్కొన్నట్లు జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు నేడు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 17 మిలియన్ల మంది ఓటర్లు దక్షిణాసియా దేశ అధ్యక్షుడిని రాబోయే ఐదేళ్లకు ఎన్నుకోనున్నారు. ఎన్నికల బరిలో మాజీ ఆర్మీ చీఫ్ తో పాటు 38 మంది అభ్యర్థులు ఉన్నారు. 1.7 కోట్ల ఓటర్లు కోసం 13,400 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 80 శాతం ఓటింగ్ నమోదవుతుందని అధికారులు అంచానా వేస్తున్నారు. అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే కాకుండా, నేషనల్ పీపుల్స్ పవర్‌..ఎన్పీపీ కు చెందిన అనుర కుమార దిసనాయకే, సమగి జన బలవేగయ ఎస్ బీ పార్టీ నుంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస నడుమే మధ్య పోరు నడుస్తుంది. 1982 తర్వాత శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ముగ్గుర్లో అనూరకూమారకే స్పష్టమైన మొగ్గు కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎవరు నెగ్గినా కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా పని చేయాల్సి ఉంటుంది.