Sreeleela శ్రీలీల చిన్నారి తో ముద్దు ముద్దు మజిలీ ఆ పాప ఎవరు

Sreeleela : శ్రీలీల చిన్నారి తో ముద్దు ముద్దు మజిలీ : ఆ పాప ఎవరు?

ప్రముఖ నటి శ్రీలీల తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో మరోసారి వార్తల్లోకి వచ్చారు.ఓ పసిపాపతో ఉన్న ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలలో కనిపిస్తున్న భావోద్వేగం అభిమానులను చక్కగా తాకుతోంది.శ్రీలీల చేతుల్లోకి తీసుకున్న చిన్నారి నవ్వుతూ ముద్దులు అందుకుంటోంది.ఇద్దరి మధ్య ఉన్న ఆ మానసిక అనుబంధం స్పష్టంగా కనిపిస్తోంది.ఈ ఫోటోలతో పాటు ఆమె ఇచ్చిన క్యాప్షన్ “మా ఇంటికి కొత్త సభ్యురాలు.మా మనసు దోచేసింది” అని ఉంది.ఆమె గుండె ఎమోజీతో పాటు దిష్టి తగలకూడదని సూచించే ఎమోజీలను కూడా జత చేశారు.ఈ ఫోటోలకీ, క్యాప్షన్‌కీ, ఆమె గత సేవా కార్యక్రమాలకీ సంబంధం చూపుతూ చర్చలు వెల్లివిరుస్తున్నాయి.ఓ చిన్నారి జీవితంలో శ్రీలీల చేసిన మార్పు గమనార్హం.

Advertisements

రహమాన్ మ్యూజిక్‌తో ఎమోషనల్ టచ్

ఈ పోస్టుకు ఆమె ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన “ఛోటీ సీ ఆశా” పాటను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా పెట్టడం ఎంతో భావోద్వేగానికి గురిచేసింది.పాట, భావాలు కలిసొచ్చే విధంగా ఈ పోస్ట్‌ను రూపొందించడం స్పెషల్ అనిపించింది.అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ నెటిజన్లు కూడా ఈ పోస్ట్‌ను బాగా షేర్ చేస్తున్నారు.ఆమె మానవత్వాన్ని గుర్తించి మంచి మాటలు చెబుతున్నారు.కానీ ఫోటోలలో కనిపించే చిన్నారి ఎవరన్నది మాత్రం ఇప్పటికీ తెలియదు.ఆ పాపయి శ్రీలీల కుటుంబానికి చెందిద.లేక ఆమె తాజాగా దత్తత తీసుకున్న పాపయా అన్నది స్పష్టంగా తెలపలేదు.అయితే, ఆమె గతానికి చూపితే, నెటిజన్లు కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు – మళ్లీ ఓ చిన్నారిని దత్తత తీసుకుందేమో అని.

గతంలో చేసిన గొప్ప పనులు

ఇది తొలిసారి కాదు.ఫిబ్రవరి 2022లో శ్రీలీల 21 ఏళ్ల వయసులోనే ఇద్దరు దివ్యాంగ పిల్లలను దత్తత తీసుకున్నారు.వారి పేర్లు గురు, శోభిత.ఓ అనాథాశ్రమాన్ని సందర్శించిన సమయంలో ఆ పిల్లలతో ఏర్పడిన అనుబంధం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.ఆ సమయంలో ఆమె చేసిన పని చాలామందిని భావోద్వేగానికి గురిచేసింది.ఈ కారణంగానే ఇప్పుడు మరోసారి ఆమెపై అందరికీ గౌరవం పెరిగింది.ఈ పోస్టుతో ఆమె మళ్లీ నిరూపించుకుంది – ఆమె కేవలం నటి కాదు, గొప్ప హృదయాన్ని కలిగిన వ్యక్తి కూడా.సోషల్ మీడియాలో ఇలా ఓ చిన్న విషయంలో కూడా హ్యూమానిటీ చూపించడం అరుదైన విషయం.

Read Also : Surya: సినిమా కోసం నటించా.. మీరు దాన్ని ఫాలో కావద్దు: సూర్య

Related Posts
Pakistani Pilot : పాకిస్థాన్‌ పైల‌ట్‌ను అదుపులోకి తీసుకున్న భార‌త‌ ఆర్మీ
Pakistani Pilot పాకిస్థాన్‌ పైల‌ట్‌ను అదుపులోకి తీసుకున్న భార‌త‌ ఆర్మీ

భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.దాయాది దేశం పాకిస్థాన్ మళ్లీ ఉన్మాదానికి పాల్పడుతోంది. అయితే, భారత్ సైన్యం అప్రమత్తంగా స్పందిస్తూ ఘాటుగా తిప్పికొడుతోంది.ఇటీవల పఠాన్‌కోట్ సెక్టార్‌లో Read more

ఒడిశా తీరానికి ఆలివ్ రిడ్లే తాబేళ్లు
ఒడిశా తీరానికి ఆలివ్ రిడ్లే తాబేళ్లు

ఒడిశా రాష్ట్రంలోని గహీర్‌మఠ సముద్ర తీరానికి అలౌకిక ప్రకృతి దృశ్యం కనువిందు చేస్తోంది. వేలాది ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఇక్కడికి చేరుకుంటున్నాయి. ఈ ప్రకృతి విశేషాన్ని సందర్శించేందుకు Read more

Delhi: మీరు హామీలు ఇస్తారు..మేము వాటిని నెరవేరుస్తాము: సీఎం రేఖా గుప్తా
You give promises..we will fulfill them.. CM Rekha Gupta

Delhi: ఢిల్లీలో కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం ఈరోజు తన తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రతిపక్ష పార్టీ ఆప్‌ Read more

Indus Waters : 4 భారత రాష్ట్రాలకు సింధు జలాలు!
sinduwater india

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సింధు నదీ జలాలు పాకిస్థాన్‌కు వెళ్లేలా ఉన్న ప్రవాహాన్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ చర్యల Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×