Soon arrangements will be made for live telecast of all cases.Supreme Court

త్వరలో అన్ని కేసులు ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు..సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం మరో కీలక మందుడుగు వేసింది. మరి కొద్దిరోజుల్లో సుప్రీంకోర్టులోని అన్ని బెంచ్‌ల వాదనలు, తీర్పులను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ యాప్ బీటా వర్షన్ ను పరీక్షించింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వాదనలు, తీర్పులను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇకపై అన్ని బెంచ్‌ల వాదనలతో పాటు తీర్పులను కూడా ప్రజలకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దీనికి సంబంధించిన కొత్త సాఫ్ట్‌వేర్ లోని బీటా వర్షన్ ను ఇవాళ విజయవంతంగా పరీక్షించినట్లు సుప్రీం కోర్టు వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా అన్ని బెంచ్‌లలో జరగబోయే లైవ్ స్ట్రీమింగ్ కు సంబంధించిన చిత్రాలకు కూడా విడుదల చేసింది. అలాగే కొత్తగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో లోటు పాట్లను సవరించి, లైవ్ స్ట్రీమింగ్ ను త్వరలోనే అధికారికంగా అమలులోకి తీసుకురానున్నట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. దీంతో సుప్రీంకోర్టులోని అన్ని బెంచ్‌లలో జరిగే వాదనలు, తీర్పులను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. కాగా రాజ్యాంగ ధర్మాసనం వాదనలు, తీర్పులను 2022 నుంచి లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు.

Advertisements
Related Posts
తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు
tirumala vaikunta ekadasi 2

పవిత్రమైన వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వారాలు అర్ధరాత్రి ప్రత్యేక పూజలతో భక్తుల కోసం తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మంగళహారతులు, Read more

కాంగ్రెస్ వచ్చింది-కష్టాలు తెచ్చింది – కేటీఆర్ ట్వీట్
KTR tweet on the news of the arrest

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా, "కాంగ్రెస్ పాలన రాష్ట్రాన్ని వణికించుకుంటూ, ధర్నాల ద్వారా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు" Read more

బడ్జెట్ పై ప్రధాని మోదీ స్పందన
modi

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పేదలు, యువత, రైతులు, మహిళలే లక్ష్యంగా బడ్జెట్ లో పలు Read more

ట్రంప్ విజయం: ‘That’s why I love you’ అని ఎలాన్ మస్క్‌ను ప్రశంసించిన ట్రంప్
elon musk

2024 యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన విజయోత్సవ ప్రసంగంలో ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. "That's why I Read more

Advertisements
×