Soon arrangements will be made for live telecast of all cases.Supreme Court

త్వరలో అన్ని కేసులు ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు..సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం మరో కీలక మందుడుగు వేసింది. మరి కొద్దిరోజుల్లో సుప్రీంకోర్టులోని అన్ని బెంచ్‌ల వాదనలు, తీర్పులను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ యాప్ బీటా వర్షన్ ను పరీక్షించింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వాదనలు, తీర్పులను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇకపై అన్ని బెంచ్‌ల వాదనలతో పాటు తీర్పులను కూడా ప్రజలకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దీనికి సంబంధించిన కొత్త సాఫ్ట్‌వేర్ లోని బీటా వర్షన్ ను ఇవాళ విజయవంతంగా పరీక్షించినట్లు సుప్రీం కోర్టు వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా అన్ని బెంచ్‌లలో జరగబోయే లైవ్ స్ట్రీమింగ్ కు సంబంధించిన చిత్రాలకు కూడా విడుదల చేసింది. అలాగే కొత్తగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో లోటు పాట్లను సవరించి, లైవ్ స్ట్రీమింగ్ ను త్వరలోనే అధికారికంగా అమలులోకి తీసుకురానున్నట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. దీంతో సుప్రీంకోర్టులోని అన్ని బెంచ్‌లలో జరిగే వాదనలు, తీర్పులను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. కాగా రాజ్యాంగ ధర్మాసనం వాదనలు, తీర్పులను 2022 నుంచి లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు.

Related Posts
కేటీఆర్‌కు మళ్లీ ఏసీబీ నోటీసులు..!
ACB notices to KTR once again..!

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి అవినీతి నిరోధక శాఖ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశముంది. కేటీఆర్ ఇచ్చిన సమాధానంపై ఏసీబీ అధికారులు లీగల్ Read more

కార్యకలాపాలను విస్తరించిన పేయిన్‌స్టాకార్డ్
Paynstockard expanded operations

హైదరాబాద్: ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేయిన్‌స్టాకార్డ్ ఈరోజు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తన కొత్త, అత్యాధునిక కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రాండిక్స్ ఇండియా అపెరల్ Read more

మహారాష్ట్ర గడ్డపై గబ్బర్ సింగ్ వార్నింగ్
pawan warning

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన స్పీచ్ తో అదరగొట్టారు. శనివారం డేగ్లూర్ బహిరంగ సభకు పవన్ Read more

Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం
Cabinet approves Telangana budget

Telangana Budget: తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్‌ కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగిన కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఈ మేరకు Read more