బుడమేరు వరదలో సాఫ్ట్వేర్ ఉద్యోగి గల్లంతు

మచిలీపట్నానికి చెందిన IT ఉద్యోగి ఫణికుమార్ (40) బుడమేరు వరదలో చిక్కుకుని గల్లంతయ్యాడు. అతని కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆయన చవితి సందర్భంగా సొంతూరు వచ్చారు. నిన్న గన్నవరంలోని బంధువుల ఇంటికెళ్లి తిరిగి మచిలీపట్నం బయలుదేరాడు. బుడమేరు ఉద్ధృతి గురించి వారు హెచ్చరించినా వినకుండా వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఓ చోట నీటిలో మునిగిన అతని కారును పోలీసులు గుర్తించారు.

మరోపక్క విజయవాడ వాసులను బుడమేరు వాగు మరోసారి భయపెడుతోంది. భారీ వర్షాలకు పులివాగు, బుడమేరు వాగుల ప్రవాహం పెరుగుతోంది. దీంతో వరద నీరు బెజవాడలోకి రాకుండా బుడమేరు వద్ద నిన్న పూడ్చిన గండ్ల ఎత్తును పెంచుతున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు అర్ధరాత్రి పనులను పర్యవేక్షించారు. మరోవైపు విజయవాడ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ సృజన ఆదేశించారు.