Snowfall Blankets Jammu and Kashmir, Transforming Tourist

శ్వేత వర్ణంలో జమ్ముకశ్మీర్‌

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లో మంచు వర్షం కురుస్తోంది. బారాముల్లా, సోనమార్గ్‌, బందిపోర సహా అనేక ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణాన్ని సంతరించుకున్నాయి. ఎటు చూసినా పరిసరాలన్నీ శ్వేత వర్ణంలో దర్శనమిస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో నిరంతరంగా మంచు కురుస్తున్నది. రహదారులు, ఇళ్లు, భవనాలు, చెట్లు, వాహనాలు, ఎత్తైన కొండలపై పడుతున్న మంచు దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. స్థానిక ప్రజలు, సందర్శకులు మంచు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు.

Advertisements

సాధారణంగా శీతాకాలంలో జమ్ముకశ్మీర్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మంచు తెరల మాటు నుంచి కశ్మీర్‌ లోయలు, కొండల అందాలను వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచేగాక, విదేశాల నుంచి కూడా పర్యాటకులు భారీగా తరలివస్తారు. మంచు వర్షానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఆకట్టుకుంటున్నాయి.

మరోవైపు భారీగా మంచు పడుతుండటంతో శ్రీనగర్ సహా ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి చేరాయి. ఉష్ణోగ్రతలు మైనస్‌ 1 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో చలి తీవ్రతకు కశ్మీర్‌ ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు.

Related Posts
రేపు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్
lokesh300cr

రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ రేపు ఉదయం సా.4.30 గంటలకు ఢిల్లీకి ప్రయాణం ప్రారంభిస్తారని అధికారికంగా తెలియజేశారు. ఈ పర్యటన ద్వారా కేంద్ర ప్రభుత్వంతో నేరుగా మాట్లాడి, Read more

షర్మిలపై జగన్ కీలక వ్యాఖ్యలు
షర్మిలతో విభేదాలు తీవ్రతరం – జగన్ కీలక ఆరోపణలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా Read more

రష్యా సైన్యంలో భారతీయులందరినీ విడుదల చేయాలి
రష్యా సైన్యంలో భారతీయులందరినీ విడుదల చేయాలి1

ఉక్రెయిన్లో ఘర్షణలో ముందంజలో ఉన్న మరో పౌరుడు మరణించిన తరువాత రష్యా తన సైన్యంలో పనిచేస్తున్న భారతీయ పౌరులందరినీ విడుదల చేయాలని భారత్ మంగళవారం డిమాండ్ చేసింది, Read more

చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ ఎప్పుడంటే?
chiru anil

మెగాస్టార్ చిరంజీవి, హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా Read more

×