నాగౌన్‌ ఎక్స్‌ప్రెస్‌లో పోగలు

గత కొద్దీ నెలలుగా వరుసగా రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదాల కారణంగా రైలు ప్రయాణం అంటే ప్రయాణికులు భయపడుతున్నారు. అధికార యంత్రాంగం పని తీరుపై ప్రజల్లో అసహనం కలిగేలా చేస్తున్నాయి. యూపీలో ఇటీవలి రైలు ప్రమాద ఘటన మరువకముందే గుజరాత్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. వల్సాద్‌లో శుక్రవారం సాయంత్రం గూడ్స్‌ ట్రైన్‌ వ్యాగన్‌ పట్టాలు తప్పింది.

ఈ రెండే అనుకుంటే ఎర్జు సోమవారం మరో రైలు ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా కావలి సమీపంలో నాగౌన్‌ ఎక్స్‌ప్రెస్‌ నుండి పొగలు రావడం ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేసింది. నెల్లూరు జిల్లా కావలి సమీపంలో రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. జనరల్‌ బోగీ చక్రాల నుంచి ఒక్కసారిగా పొగలు చెలరేగాయి. లోకో పైలట్‌ గమనించి రైలును నిలిపివేశారు. బ్రేక్‌ డౌన్‌ కారణంగానే పొగలు సంభవించాయని నిర్థారించారు. రైల్వే సిబ్బందికి సమాచారం అందజేశారు. ఘటన స్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మతులు చేశారు. అనంతరం రైలు అక్కడి నుంచి యథావిథిగా వెళ్లిపోయింది. రైలు తాంబరం నుంచి సిల్‌ఘాట్‌ టౌన్‌ వెళ్తుండగా ఘటన జరిగింది.