ప్రధాని మోడీ కారుపై చెప్పు..

ప్రధాని ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారుపై గుర్తు తెలియని దుండగుడు చెప్పు విసరడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటిస్తున్న సందర్భంగా ప్రధాని మోదీకి ఈ ఊహించని పరిణామం ఎదురైంది. రెండు రోజుల క్రితం వారణాసిలో పర్యటనకు వెళ్ళిన మోదీ కాన్వాయ్ మీద చెప్పులు విసిరారు. ఎవరు విసిరారు, ఎందుకు విసిరారు అన్న విషయాలే బయటకు రాలేదు కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ప్రధాని పర్యటన అంటే భారీ బందోబస్తు ఉంటుంది. ఎవర్నీ సెక్యూరిటీ దాటి ప్రధాని వద్దకు వెళ్లకుండా పటిష్ఠ భద్రత ఉంటుంది. ప్రధాని రోడ్ షో అంటే.. ముందుగానే అన్ని పకడ్బందీ చర్యలు చేపట్టి.. అంతా ఓకే అనుకున్న తర్వాతే కాన్వాయ్ బయల్దేరుతుంది. అయితే అంతటి సెక్యూరిటీ, పటిష్ఠ బందోబస్తు ఉన్నప్పటికీ.. తాజాగా ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ప్రధాని ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారుపై గుర్తు తెలియని దుండగుడు చెప్పు విసరడం ప్రస్తుతం సంచలనంగా మారింది.

వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్‌ నుంచి కేవీ మందిర్‌కు మోదీ కాన్వాయ్‌ రోడ్ షోగా వెళ్తున్న సమయంలో.. ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 1.41 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో 19 సెకన్ల తర్వాత ఆ గుంపులో ఉన్న ఓ వ్యక్తి.. చెప్పు విసిరినట్లు కనిపిస్తోంది. అది కాస్తా వచ్చి ప్రధాని ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు బానెట్‌పై పడినట్లు వీడియోలో ఉంది. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడే ఉన్న ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది.. 5, 6 సెకన్ల వ్యవధిలోనే చేతితో తీసి పక్కకు విసిరేయడం కనిపిస్తోంది.

వారణాసిలో మోడీ కాన్వాయ్ మీద చెప్పు విసిరిన దుండగుడు. pic.twitter.com/SOtyxy70ax— Telugu Scribe (@TeluguScribe) June 19, 2024