WhatsApp Image 2024 11 11 at 10.56.56

ఆరవ రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరవ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సభ ప్రారంభంలో ప్రశ్నోత్తరాల సెషన్ జరగనుంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు అసెంబ్లీలో చర్చకు రానున్నాయి.

2017-18, 2018-19 సంవత్సరాల హిందూపూర్ అర్బన్ డెవలప్‌మెంట్ ఆడిట్ రిపోర్టుల ఆలస్యానికి కారణాలను సభ ముందు మంత్రి పొంగూరు నారాయణ ప్రవేశపెట్టనున్నారు. డివిజినల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీలో సభ్యుని ఎంపికకు ప్రతిపాదనను మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సభ ముందుకు తీసుకురానున్నారు.

ఇక, ఈ సమావేశాల్లో ఏపీ పంచాయితీరాజ్ సవరణ బిల్లు 2024, ఏపీ మున్సిపల్ లా సవరణ బిల్లు 2024, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు 2024, ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లులపై చర్చ జరగనుంది. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రాంట్‌లకు సంబంధించిన బిల్లులు కూడా సభ ముందుకు రానున్నాయి.

Related Posts
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu launched the free gas cylinder scheme

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఈరోజు ప్రారంభమైంది. దీపం 2 పథకంలోని భాగంగా సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురంలో ఈ Read more

పినాకా రాకెట్ వ్యవస్థ: ప్రపంచ దేశాల నుండి ఆసక్తి పెరుగుతోంది..
pinaka

భారతదేశం సైనిక రంగంలో మరో విజయం సాధించింది. భారత సైన్యానికి ఉపయోగపడే పినాకా రాకెట్ వ్యవస్థ యొక్క తాజా మోడల్ విజయవంతంగా పరీక్షించబడింది. ఈ పరీక్ష భారతదేశంలోని Read more

సుప్రీంకోర్టులో నందిగం సురేష్‌కు షాక్
nandigam suresh

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్‌కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మంగళవారం నందిగం సురేష్‌ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ Read more

రేవంత్ రెడ్డితో రేపు సినీ పరిశ్రమ భేటీ: దిల్ రాజు
రేవంత్ రెడ్డితో రేపు సినీ పరిశ్రమ భేటీ: దిల్ రాజు

సిని పరిశ్రమ రేపు సీఎం రేవంత్ రెడ్డిని కలవనుంది: దిల్ రాజు తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు, రేపు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *