Sitara Ghattamaneni PMJ Jew

పీఎంజే జ్యూవెల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సితార

పీఎంజే జ్యూవెల్స్ మరో సరికొత్త క్యాంపెయిన్‌ను ఆవిష్కరించింది. పీఎంజే జ్యూవెల్స్ కు సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి ఘట్టమనేని సితార బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మోడర్న్ లిటిల్ ప్రిన్సెస్ సితార పీఎంజే జ్యూవెల్స్ విశిష్టతను, ప్రత్యేకతను ప్రతిబింబిస్తూ మరో క్యాంపెయిన్‌ కు శ్రీకారం చుట్టారు. ఈ క్యాంపెయిన్‌లోని సరికొత్త కలెక్షన్ ఆభరణాలు భారతీయ వారసత్వాన్ని, నైపుణ్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. పచ్చలు, వజ్రాలు, కెంపులతో అద్దిన, అత్యాధునికంగా, కళాత్మకంగా తయారైన ఎన్నోరకాలు డిజైన్ల కలెక్షన్ అందుబాటులో తీసుకు వచ్చారు పీఎంజే జ్యూవెల్స్.

Advertisements

పెళ్లి నగలతోసహా ‌రకాల వేడుకల్లో ధరించేందుకు అనువుగా ఈ ఆభరణాలు తయారయ్యాయి. ఈ జ్యుయెలరీ కలెక్షన్‌ను మీరు ధరిస్తే రాయల్ లుక్‌ మీ సొంతం. వేడుక ఏదైనా సరే మీరు మెరిసిపోవడం ఖాయం. పీఎంజే జ్యువెల్స్ లేటెస్ట్ కలెక్షన్ ఆభరణాలు ధరించిన సితార ఫొటోలను టైమ్స్ స్క్వేర్ వద్ద ఆవిష్కరించారు. ఈ లేటెస్ట్ క్యాంపెయిన్ ద్వారా భారతీయ నగల విశిష్టత, ప్రత్యేకత ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తెలుసుకోబోతున్నారు. కళాత్మకమైన ఆభరణాల ప్రత్యేకతను చాటిచెప్పడమే కాకుండా భారతీయ వారసత్వాన్ని, నైపుణ్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకే ఈ క్యాంపెయిన్ అని పేర్కొన్నారు పీఎంజే జ్యూవెల్స్. అన్నట్టు ఈ బ్రాండ్స్ ద్వారా తానూ సంపాదించిన మొత్తాన్ని మహేశ్ బాబు ఛారిటబుల్ ట్రస్ట్ కు డొనేట్ చేస్తానని ఘట్టమనేని సితార ఓ ఇంటర్వ్యూ లో తెలిపింది ఘట్టమనేని వారసురాలు.

Related Posts
IPL : 2025లో మారిన రికార్డులు, టాప్ ప్లేయర్లు
IPL : 2025లో మారిన రికార్డులు, టాప్ ప్లేయర్లు

మారిన ఆట రికార్డులు తారుమారు న్యూఢిల్లీ: IPL18 సీజన్ రసవత్తరం సాగుతోంది. ఈ సీజన్లో ఏవో ఊహించని జట్లు అనూహ్య ప్రదర్శనలు కనబరుస్తున్నాయి. IPL ఇప్పటివరకు ఐదు Read more

మన్మోహన్ సింగ్ ఆర్ధిక సంస్కరణల నాయకుడు
manmohan singh

అతి సామాన్య వ్యక్తిగా పుట్టి, అసమానమైన వ్యక్తిగా ఎదిగిన మన్మోహన్ సింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భారత్ వంటి అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్ధలో, అదీ Read more

బడ్జెట్ లో సీనియర్ సిటిజన్‌లకు పెద్ద ఉపశమనం
బడ్జెట్ లో సీనియర్ సిటిజన్‌లకు పెద్ద ఉపశమనం

2025 బడ్జెట్ సీనియర్ సిటిజన్ల కోసం ముఖ్యమైన పన్ను సంస్కరణలను ప్రకటించింది, ఇది వారి పన్ను భారాన్ని తగ్గించడానికి మరియు వారి పొదుపులను ప్రోత్సహించడానికి దోహదం చేస్తుంది. Read more

బెటాలియన్‌ కానిస్టేబుళ్లకు ఊరట..
Relief for battalion consta

తెలంగాణ బెటాలియన్‌ పోలీస్‌ కానిస్టేబుళ్ల కుటుంబాల నిరసనలు ఫలవంతమయ్యాయి. ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన సెలవుల జీవో పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన కుటుంబసభ్యులు, ఈ Read more

Advertisements
×