SIIMA: ఉత్తమ నటుడిగా నాని

సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్)- 2024 అవార్డుల ప్రదానోత్సవం శనివారం (సెప్టెంబర్ 14) సాయంత్రం దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. తొలిరోజు కన్నడ, తెలుగు భాషల్లో ఎంపికైన చిత్రాలకు అవార్డులు పంపిణీ చేశారు. తమిళ, మలయాళ చిత్రాలకు ఆదివారం (సెప్టెంబర్ 15) అవార్డులు అందజేయనున్నారు. తెలుగు పురస్కారాలకు సంబంధించి ‘దసరా’, హాయ్ నాన్న, ‘బలగం’ చిత్రాలు ఎక్కువ అవార్డులు సాధించాయి.

దసరా మూవీకి గాను ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ నటిగా కీర్తి సురేశ్ అవార్డులు అందుకున్నారు. బెస్ట్ మూవీ-భగవంత్ కేసరి, ఉత్తమ నేపథ్య గాయకుడు-రామ్ మిర్యాల (బలగం), బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్- బేబీ ఖియారా, ఉత్తమ నటుడు (క్రిటిక్స్)-ఆనంద్ దేవరకొండ, బెస్ట్ కమెడియన్-విష్ణు (మ్యాడ్), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్-అబ్దుల్ (హాయ్ నాన్న).