శేఖర్ కమ్ముల, నాని కాంబోలో సినిమా..?

వరుస హిట్లతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని..శేఖర్ కమ్ముల డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడా ..? అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. రీసెంట్ గా నాని సరిపోదా శనివారం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు..ప్రస్తుతం హిట్-3తో పాటు శ్రీకాంత్ ఓదెలతో ఓ మూవీ చేస్తున్నారు. ఇదే క్రమంలో happy డేస్ ఫేమ్ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ జరిగాయని, నాని ఓకే చెప్పినట్లు సినీవర్గాల్లో టాక్ నడుస్తోంది. 2025లో షూటింగ్ స్టార్ట్ అవ్వొచ్చని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘కుబేర’తో బిజీగా ఉన్నారు.